NTV Telugu Site icon

Samantha: సామ్ వేసుకున్న ఆ డైమండ్ నెక్లస్ ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే

Sam

Sam

Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి సిటాడెల్ రీమేక్. వరుణ్ ధావన్, సమంత జంటగా రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఇక సిటాడెల్ సిరీస్ లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడాన్ జంటగా హాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ రస్సో బ్రదర్స్ తెరకెక్కించారు. ఈ సిరీస్ అమెజాన్ లో ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మేకర్స్ సిటాడెల్ ప్రీమియర్ షోలను లండన్ లో వేశారు. ఈ ప్రీమియర్ షోకు ఇండియన్ సిటాడెల్ టీమ్ హాజరయ్యి సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. రాజ్ అండ్ డీకే, వరుణ్ ధావన్ తో కలిసి సమంత ఈ ప్రీమియర్ షోలో మెరిశారు. ఇక బ్లాక్ అండ్ బ్లాక్ లో సమంత హాలీవుడ్ హీరోయిన్ లా కనిపించింది. బ్లాక్ అండ్ బ్లాక్ డిజైనర్ డ్రెస్ పై కాస్ట్లీ డైమండ్ సెట్ తో అదరగొట్టేసింది. దీంతో ఆ డైమండ్ సెట్ ధర ఎంత అనే చర్చజరిగింది. ఇక నెటిజన్లు దాని ధర తెలుసుకొని దిమ్మ తిరిగిపోతున్నారు.

Priyanka Chopra: బెడ్ సీన్స్ .. ఆ పార్ట్స్ కనిపించకుండా చేతులను అడ్డుపెట్టి

సమంత వేసుకున్న బ్లాక్ విక్టోరియా బెక్హాం క్రోచెట్ ప్యాచ్‌వర్క్ స్కర్ట్ ధర రూ. 65 వేలు. దానిపైన బ్లాక్ క్రాప్ టాప్ ధర రూ. 16,900. మొత్తం కలిపి బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ ధర దాదాపు రూ. 90 వేలు. ఇక సామ్ ధరించిన బల్గారి డైమండ్ నెక్లస్ ధర అక్షరాలా రూ. 2.9 కోట్లు. దానికి మ్యాచింగ్ గా ఉన్న బ్రాస్ లెట్ రేటు.. రూ. 2.6 కోట్లు అంత. వింటుంటేనే దిమ్మతిరిగిపోతుంది కదా. అది సమంత రేంజ్ మరీ.. ప్రస్తుతం సామ్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. శాకుంతలం ప్లాప్ అయ్యాకా అమ్మడు ఆశలన్నీ ఈ రీమేక్ మీదనే ఉన్నాయి. మరి ఈ రీమేక్ తో సామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Show comments