Lenin : అఖిల్‌కు మాజీ వదిన కంగ్రాట్స్.. సోషల్ మీడియాలో సామ్ పోస్ట్ వైరల్

Samanta Lenin

Samanta Lenin

అక్కినేని హీరో అఖిల్ నటించిన మోస్ట్ అవేటెడ్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ లెనిన్. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈ రోజు ఉదయం ఆటతో థియేట్రికల్ రిలీజ్‌ అయింది. ఈ తరుణంలో ఒక బ్యూటిఫుల్ మూమెంట్ చోటుచేసుకుంది. అక్కినేని కుటుంబానికి మాజీ కోడలైన స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు.. అఖిల్ అక్కినేని నటిస్తోన్న ‘లెనిన్’ సినిమాకు బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

నాగచైతన్య, సమంత వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయిన సంగతి తెలిసిందే. వారు విడిపోయినప్పటికీ అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్‌తో సమంతకు ఉన్న అనుబంధం, గౌరవం ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది సామ్. ఇటీవల సమంత నటించిన మా ఇంటి బంగారంపై లెనిన్ ప్రమోషన్స్ లో అఖిల్ మాట్లాడుతూ ఆ సినిమా సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది అని సామ్ కు విషెష్ తెలిపారు. ఇక సామ్.. ఇప్పుడు ‘లెనిన్’ చిత్ర యూనిట్‌కు, ముఖ్యంగా అఖిల్ అక్కినేనికి కంగ్రాట్స్ చెబుతూ ఆల్‌ ది బెస్ట్ అఖిల్ అండ్ లెనిన్ టీమ్. ఆల్రెడి బ్లాక్ బస్టర్ వైబ్స్ ఉన్నాయి అని చెప్పడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సమంత పోస్ట్ పై అటు నెటిజన్లు, ఇటు అక్కినేని అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “వ్యక్తిగత జీవితాలు వేరైనా.. వారి మధ్య ఉన్న బాండింగ్ మరియు మ్యూచువల్ రెస్పెక్ట్ ఎప్పటికీ మారవు” అంటూ  కామెంట్లు పెడుతున్నారు. సమంత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.