Samantha Vs Sobhita Social Media War became Hottopic: సమంత నాగ చైతన్య 2017లో పెళ్లి చేసుకుని, 2021లో విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మయోసైటిస్ బారిన పడిన సమంత ప్రస్తుతం పూర్తిగా కోలుకొని సినిమాల మీద ఫోకస్ చేస్తోంది. అయితే నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ళ డేటింగ్ రూమర్స్ నేపథ్యంలో సమంత, శోభిత చేసిన సోషల్ మీడియా పోస్టులు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. నిజానికి వీరు ఒకరినొకరు ఉద్దేశించి చేసుకున్నారో లేదో వారికే తెలియాలి కానీ నెటిజన్లు మాత్రం ఒకరికి ఒకరు కౌంటర్లు లాగా పోస్టులు పెట్టారని ఫిక్స్ అయిపోతున్నారు. సమంత ఏప్రిల్ 28న తన 37వ పుట్టిన రోజును ఏథెన్స్ లో జరుపుకుని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Thalaimai Seyalagam: శ్రియారెడ్డి లీడ్ రోల్ లో పొలిటికల్ థ్రిల్లర్
అలాగే ఓ స్పెషల్ కన్ను గుర్తు ఉన్న పెండెంట్ రోజ్ గోల్డ్ చైన్ ను స్పెషల్ గా పోస్ట్ చేసి హాట్ టాపిక్ అయింది. ఆ అనంతరం బుధవారం నాడు సమంత మీ వృషభ రాశి వ్యక్తిని ఎప్పటికీ కోల్పోకండి (డోంట్ ఎవర్ లూజ్ యో టౌరస్) అని ఒక పోస్ట్ షేర్ చేసింది. సమంత ఈ పోస్ట్ లో వృషభ రాశి వ్యక్తులను వదులుకోకూడదు అనే విషయాన్ని చెప్పినట్టు కామెంట్స్ వినిపించాయి. ఆ కాసేపటికే శోభిత ఐయాం నాట్ ఎవ్రీ వన్ కప్ ఆఫ్ చాయ్… అండ్ దట్స్ ఓకే అంటూ ఒక పోస్ట్ ని ఇన్స్టా లో షేర్ చేసింది. నిజానికి వారు తమ తమ అభిప్రయాలను షేర్ చేసి ఉండొచ్చు కానీ అవి రెండూ కౌంటర్లు అని సోషల్ మీడియా జనం ఫిక్స్ అయ్యారు. ఇంతకీ మీరేం అంటారు ?