NTV Telugu Site icon

Samantha: ఒప్పుకున్న సినిమాల నుంచి తప్పుకోలేదు…

Samantha

Samantha

టాలీవుడ్ లో సూపర్ స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకున్న యాక్ట్రెస్ ‘సమంతా’. ఏం మాయ చేసావే సినిమా నుంచి తెలుగు ఆడియన్స్ ని మాయ చేస్తూనే ఉన్న సామ్ గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. సమంతా తెలుగులో నటించట్లేదు, ఆల్రెడీ ఓకే చేసిన సినిమాలని కూడా క్యాన్సిల్ చేస్తుంది, సామ్ ఇకపై తెలుగు తెరపై కనిపించదు, బాలీవుడ్ సినిమాల్లో మాత్రమే నటిస్తుంది లాంటి మాటలు ట్విట్టర్ లో మరీ ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో సమంతా పర్సనల్ టీం ఈ రూమర్స్ పై రెస్పాండ్ అయ్యారు. సమంతా ఏ సినిమాని క్యాన్సిల్ చెయ్యలేదు, ఓకే చెప్పిన ప్రతి సినిమాని కంప్లీట్ చేస్తుంది. జనవరిలో విజయ్ దేవరకొండతో నటిస్తున్న ‘ఖుషి’ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది, ఈ మూవీ షూటింగ్ అయిపోయాక హిందీలో ఓకే చెప్పిన ప్రాజెక్ట్స్ చేస్తుందనే క్లారిటీ ఇచ్చారు.

ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ తర్వాత సమంతా బాలీవుడ్ లో తన లక్ ట్రై చేస్తోంది. ఈ షోని డైరెక్ట్ చేసిన రాజ్ అండ్ డీకే తో సామ్ మరో ప్రాజెక్ట్ చేస్తోంది. తెలుగులో సమంతా నటించిన ‘శాకుంతలం’ తప్ప మరే సినిమా రిలీజ్ కి రెడీగా లేదు. ఖుషి సినిమా షూటింగ్ కూడా అయిపోతే సమంతా చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా ఉండడు. ఇలాంటి సమయంలో సామ్ కాస్త బ్రేక్ తీసుకోని బాలీవుడ్ కమిట్మెంట్స్ ని పూర్తి చేసుకోని మళ్లీ సౌత్ లో నటిస్తుందా? లేక ఖుషీ సినిమా షూటింగ్ అయిపోగానే సమంతా తన నెక్స్ట్ మూవీ అనౌన్స్మెంట్ ఇస్తుందా అనేది చూడాలి. ఇప్పటికైతే సమంతా షూటింగ్స్ ని పూర్తిగా పక్కన పెట్టేసి హెల్త్ గురించి కేర్ తీసుకుంటుంది.

Show comments