Site icon NTV Telugu

‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సమంత?

నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన థియేటర్లోకి రాబోతోంది. ‘లవ్ స్టోరీ’ సినిమాపై అభిమానులు బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అభిమానులకు విపరీతంగా నచ్చాయి. అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హాజరు కానున్నారు. అయితే ఈ ఈవెంట్ కు చైతు సతీమణి సమంత కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే చైతు-సమంత కొద్దిరోజులుగా డైవర్స్ వార్తలతో ఎక్కువ ప్రచారంలో నిలుస్తున్నారు. దీనిపైనా అక్కినేని ఫ్యామిలీ కూడా మౌనంగా ఉండటంతో మరింత అనుమానాలకు తావిస్తోంది. అయితే వీటన్నిటికి చెక్ పెట్టేందుకు లవ్ స్టోరీ ఈవెంట్ వేదిక కానున్నట్లు సమాచారం.. ఇదివరకే సమంత ఈ ఈవెంట్‌కు వస్తున్నట్లుగా సమాచారం పంపిందనేది తాజా సమాచారం.. ఒకేవేళ సమంత గనుక హాజరు అయినట్లు ఐతే విడాకుల వార్తలకు ఫుల్ స్టాఫ్ పడ్డట్లే అవుతుందని సినీ విశ్లేషకుల మాట.. మరి సమంత వస్తుందో లేదో తెలియాలంటే కొద్దిసేపు ఆగాల్సిందే..!

ఈ సినిమాకు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్త సమర్పణలో కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు. పవన్ సీహెచ్ సంగీతం అందించారు. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది.

Exit mobile version