Site icon NTV Telugu

సామ్ “పుష్ప” స్పెషల్ సాంగ్ ఎప్పుడు? ఎక్కడ ?

Samantha

Samantha

సౌత్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సమంత తన కెరీర్‌లో తొలిసారిగా ఓ స్పెషల్ సాంగ్‌లో రెచ్చిపోనుంది. ‘పుష్ప’ స్పెషల్ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో పాటు సామ్ బోల్డ్‌ లుక్ లో చిందేయనుంది. సుకుమార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కు కూడా ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆ సాంగ్ లో చేసేవారి క్రేజ్ మరింత పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి పూజాహెగ్డే ‘జిగేలు రాణి’గా మారడమే నిదర్శనం. కాగా సినిమా విడుదల దగ్గర పడుతోంది. ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని బన్నీ అభిమానులు ఆందోళన పడుతున్నారు. వారి ఆందోళనను దూరం చేసే తాజా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Read Also : “పుష్ప” ట్రైలర్ అప్డేట్… వైల్డెస్ట్ మాస్ ఫెస్టివల్ ఎప్పుడంటే ?

సామ్ అదిరిపోయే ఐటమ్ నంబర్ షూటింగ్ ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ప్రారంభమవుతుంది. బాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, బన్నీ, సామ్ కోసం కొన్ని అల్ట్రా మాస్ డ్యాన్స్ మూవ్‌లను కంపోజ్ చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరపరిచిన ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాసిల్, శాండల్‌వుడ్ నటుడు ధనంజయ, సునీల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా బ్యానర్లు సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా రూపొందనున్న ఈ పాన్ ఇండియా చిత్రం డిసెంబర్ 17న థియేటర్లలోకి రానుంది.

Exit mobile version