NTV Telugu Site icon

Samantha: విజయ్.. ఒక రౌడీ.. రెబల్.. ఆ అలవాట్లు.. షాక్ అయ్యాను

Sam

Sam

Samantha: విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ఈ మధ్య జరిగిన మ్యూజిక్ కన్సర్ట్ లో విజయ్, సమంత డాన్స్ తో సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. మ్యూజిక్ కన్సర్ట్ అయిన తర్వాత సమంత న్యూయార్క్ వెళ్ళిన విషయం తెలిసిందే. వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న ఆమెను ప్రమోషన్స్ కు రమ్మని అభిమానులు కోరుకున్నారు. దీంతో న్యూయార్క్ లో ఉన్న సామ్ ప్రమోషన్స్ కి వస్తుందా..? రాదా..? అని అందరూ ఎంతగానో ఎదురు చూశారు. కాగా అనారోగ్యం బాగోక పోయినా కొన్ని ఇంటర్వ్యూస్ అయితే చేసి వెళ్ళింది. అందులో ఒక ఇంటర్వ్యూ యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

Mangli: మంగ్లీ క్రేజ్ మాములుగా లేదు.. పోలీసులు కూడా..

తాజాగా ఆ ఇంటర్వ్యూలో విజయ్, సమంత పాల్గొన్నారు. ఇక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ గురించి సమంత ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. ” విజయ్ ను చూసిన వారందరూ అతను రౌడీ, రెబల్ అని అనుకుంటారు. నేను కూడా మొదట్లో అతనిని రౌడీ అని అనుకున్నాను. కానీ, మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే.. అతనికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. ప్రతిరోజు విజయ్ వర్కౌట్ చేస్తాడు. చాలా డిస్ప్లేన్ గా ఉంటాడు. అది చూసి నేను షాక్ అయ్యాను. ఏంటి ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదా అని షాక్ అయ్యాను.. చాలా మంచి వ్యక్తి” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సామ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో ఈ జంట ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.

Show comments