Site icon NTV Telugu

Samantha: ఎట్టకేలకు.. ఆ హీరో సరసన బాలీవుడ్ డెబ్యూ కన్ఫమ్?

Samantha Ayushman Film

Samantha Ayushman Film

Samantha Signed Her First Bollywood Film Opposite Ayushmann Khurrana: ‘ద ఫ్యామిలీ సీజన్-2’ విడుదల అయినప్పటి నుంచి.. సమంత బాలీవుడ్ డెబ్యూ ఎప్పుడు? అనే చర్చలు జరుగుతూ వస్తున్నాయి. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరసన ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది కానీ, సినిమానే కన్ఫమ్ చేయకుండా కన్ఫ్యూజన్‌లో పెట్టేసింది ఈ స్టార్ నటి. తొలుత తాప్సీ పన్ను నిర్మాణంలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేయనున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి కానీ, అధికారిక సమాచారం మాత్రం రాలేదు. దీంతో.. సమంత అరంగేట్రం ఎప్పుడు? అనే ప్రశ్న మళ్లీ మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే, ఇప్పుడు ఆ మిస్టరీకి దాదాపు తెరపడినట్టైంది. ఎందుకంటే, సమంత ఎట్టకేలకు ఓ బాలీవుడ్ సినిమాకి సంతకం చేసిందని సమాచారం.

బాలీవుడ్ మీడియా ప్రకారం.. ఆయుష్మాన్ ఖురానా సరసన ఓ హారర్-కామెడీ సినిమాలో కథానాయికగా నటించేందుకు సమంత పచ్చజెండా ఊపిందట! ఆల్రెడీ ఆయుష్మాన్‌తో చేసిన ‘బాలా’ సినిమా దర్శకుడు అమర్ కౌశిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్టు తెలిసింది. రాజస్థాన్‌లో జరిగిన ఓ నిజ జీవితం సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో సమంత ఓ యువరాణి పాత్రలో నటించనుందని.. దాదాపు ఆమె పాత్ర చుట్టే సినిమా మొత్తం నడుస్తుందని తెలుస్తోంది. అంటే, కథానాయిక పాత్రకు ఈ చిత్రంలో అత్యంత ప్రాముఖ్యత ఉండనుందన్నమాట! అందుకే, తన నటవిశ్వరూపం చూపించొచ్చన్న ఉద్దేవంతో సమంత ఈ చిత్రానికి సంతకం చేసినట్టు కనిపిస్తోంది. ఇందులో హారర్‌తో పాటు సస్పెన్స్, కామెడీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయని.. ఇదొక యునిక్ సినిమా అని చెప్తున్నారు. ఇందులో ఆయుష్మాన్ రక్తపిశాచి (Vampire) పాత్రలో నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇది వచ్చే ఏడాది సెట్స్ మీదకి వెళ్లనుందని సమాచారం.

Exit mobile version