Samantha Shares her latest Bikini Pic goes Viral in Social Media: సంవత్సరాలు గడిచేకొద్దీ వయసు పెరిగితే.. సమంత ఏజ్ మాత్రం యాంటీ క్లాక్‌వైజ్‌లో తిరుగుతూ తగ్గుతోందని ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చూస్తే ఈజీగా అర్ధం అవుతుంది. నిజానికి సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ బ్యూటీ క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంది. పద్ధతి ప్రకారం డైట్ తీసుకుంటుంది. ఇవన్నీ చేస్తే ఫిట్‌గా వుంటుందిగానీ.. వయసు తగ్గదు కానీ సమంత తన మెటబాలిక్ ఏజ్ 23 మాత్రమే అంటూ షాక్ ఇచ్చింది. అదేంటి అని షాక్ అవకండి. సాధారణంగా ఎవరి వయసైనా.. పుట్టినప్పటి నుంచి లెక్కిస్తారు. అయితే మెట బాలిక్ ఏజ్ అనేది బాడీ హెల్త్‌ని బట్టి లెక్కేస్తారు. అసలు ఏజ్ కంటే మెటబాలిక్ ఏజ్ తక్కువగా వుంటే హెల్తీగా వున్నట్టు అర్థం. రీసెంట్‌గా తన ఇన్‌స్టాలో చైనీస్ బొమ్మలా చేసిన ఫీట్ ఫొటోను పోస్ట్ చేసిన సామ్ మరోసారి వార్తల్లో నిలిచింది. చుట్టూ వున్న లొకేషన్స్ షేర్ చేస్తూ.. ఓ పేపర్ కూడా పోస్ట్ చేసింది సమంత. వెయిట్ 50 కేజీలు అని.. మెటబాలిక్ ఏజ్ 23 అని అందులో రాసి వుంది. ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
ఆ సమంత పోస్ట్ తర్వాత మెటబాలిక్ ఏజ్ అంటే ఏంటంటూ గూగుల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఆ అంశం మరువక మునుపే ఆమె బికినీలో సెగలు రేపే ఒక స్టిల్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకెముంది ఆమె అభిమానులు కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. నిజానికి మయో సైటిస్ నుంచి బైటపడ్డ సామ్ ఆరోగ్యంగానే ఉంది. అయితే దారి తప్పిన ఆరోగ్యం కుదుటపడుతుందా? అని సమంత ఒకానొక టైంలో భయపడిపోయింది కానీ ఇప్పుడు నార్మల్‌కు వచ్చేసింది. ఎంచక్కా యాడ్స్‌తో బిజీగా గడిపేస్తూ గ్లామర్ స్టిల్స్‌తో రెచ్చగొడుతోంది. అయితే అన్నీ బాగానే ఉన్నా.. ఈ అమ్మడి చేతిలో సినిమా ఛాన్స్ ఒక్కటీ లేదు. మయోసైటిస్ నుంచి కోలుకుని.. సంపూర్ణ అరోగ్యంతో వున్నానని సామ్ సంకేతాలు పంపినా… సినిమా ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు. మయోసైటిస్‌కు ముందు ఓకె చేసిన ఖుషీ తర్వాత మరో సినిమాకు సైన్ చేయలేదు. ఇంత కాలం ఆరోగ్యం బాగోలేదు.. ఫిట్‌నెస్ కోసం.. సినిమాలకు దూరమైంది అనే ప్రచారం నడిచింది కానీ నెలలు గడుస్తున్నా ఒక్క ఆఫర్ రాకపోవడం షాక్ ఇస్తోంది. అందుకే ఆమె నేను రెడీ అనే సంకేతాలు ఇస్తున్నట్టుగా అనిపిస్తోంది ఆమె పోస్టులు చూస్తోంటే.
