మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో అభిమానులతో పాటు పలువురు సెలెబ్రిటీలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేస్తున్నారు. సెలబ్రిటీల్లో ముందుకు తమన్నాకు బర్త్ డే విషెస్ పంపిన బ్యూటీ సమంత. సమంత తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో “అద్భుతమైన తమన్నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ప్రేమ నుంచి శక్తిగా ఎదగడం నేను చూశాను. ఈ రోజు మిమ్మల్ని ఇలా నటిగా / వ్యక్తిగా చూడటం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. మీకు ఎప్పుడూ మరింత శక్తి చేకూరాలి” అంటూ తమన్నాను విష్ చేసింది సమంత. ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటూ ఈ సౌత్ స్టార్ హీరోయిన్లు పరిశ్రమలో హెల్దీ పోటీని ఎంజాయ్ చేస్తున్నారు.
Read Also :
మరోవైపు తమన్నా నటిస్తున్న ఎంస్ట్ మూవీ “ఎఫ్ 3” టీం నుంచి ఆమెతో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంటున్న వెంకటేష్ దగ్గుబాటి కూడా ఆమె కోసం హృదయపూర్వక పుట్టినరోజు నోట్‌ను షేర్ చేశారు. “హ్యాపీ హ్యాపీ బర్త్ డే డియర్ తమన్న. ఈ సంవత్సరం మీకు సంతోషంతో పాటు విజయాలు లభిస్తాయని ఆశిస్తున్నాను! మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు!” అంటూ తమన్నా పిక్ ను షేర్ చేశారు. తమన్నా సినిమాల విషయానికొస్తే ‘ఎఫ్ 3’, ‘ప్లాన్ ఎ ప్లాన్ బి’, ‘గుర్తుందా శీతాకాలం’తో సహా 2022లో విడుదల కానున్న పలు సినిమాల్లో నటిస్తోంది. ‘ప్లాన్ ఎ ప్లాన్ బి’ అనేది తమన్నా నెట్‌ఫ్లిక్స్ మూవీ.
