Site icon NTV Telugu

Samantha Ex Makeup Artist: ఎన్నైనా తిట్టండి కానీ..సమంత ఫాన్స్’కి మేకప్ ఆర్టిస్ట్ వార్నింగ్

Samanttha Makep

Samanttha Makep

నటి సమంత రాజ్ నిడుమోరు అనే దర్శకుడిని రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, వీరి వివాహం అనంతరం, ఈ వివాహం నేపథ్యంలో వారికి చాలామంది శుభాకాంక్షలు తెలియజేస్తుంటే, కొంతమంది మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. అందులో ముఖ్యంగా, సమంతకు గతంలో వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్‌గా వ్యవహరించిన సాధనా సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక స్టేటస్ వైరల్ అయింది. అందులో ఆమె “అసలైన నేరస్థుడే బాధితుడు అన్నట్టు కలరిచ్చి, ఇప్పుడు తన నిజస్వరూపం బయటపెట్టాడు” అన్నట్లుగా పేర్కొంది. ఆమె ఎవరి గురించి చెప్పుకొచ్చింది అనే విషయాన్ని ప్రస్తావించకపోయినా, అది సమంత గురించే అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Also Read :Kavitha : పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కవిత ఫైర్‌..

ఈ నేపథ్యంలో, సమంత అభిమానులు సాధనా సింగ్‌ను టార్గెట్ చేసిన నేపద్యంలో, ఆమె దానికి దీటుగా సమాధానం ఇస్తోంది. తనను ఇన్బాక్స్‌లోకి వచ్చి తిట్టేవాళ్ళని, కామెంట్స్‌లో తిట్టేవాళ్ళని టార్గెట్ చేస్తూ, తనను తిట్టాలంటే ఇంగ్లీష్, భోజ్‌పురి లేదా హిందీలో మాత్రమే తిట్టాలని పేర్కొంది. తనకు ఇతర భాషలు రావు కాబట్టి ఆ భాషలలో తిడితే తనకు అర్థం కాదని, మీ తిట్లు అన్నీ వృధా అవుతున్నాయని కామెంట్ చేసింది. ఈ నేపద్యంలో సాధనా సింగ్ ఏ మాత్రం వెనకాడడం లేదని అర్థమవుతోంది. ఆమె ఉద్దేశంలో సమంత చేసింది కరెక్ట్ కాకపోవచ్చు, అందుకే ఆమె సమంత నుంచి విభేదించి బయటకు వచ్చి ఉండవచ్చు అని చర్చ జరుగుతోంది.

Exit mobile version