Site icon NTV Telugu

Samantha: ‘బజార్’ కోసం మళ్ళీ హద్దులు దాటేసిన సమంత

Samantha Ruthprabhu

Samantha Ruthprabhu

Samantha Ruthprabhu sizzles in a Monokini photo shoot for Bazaar Magazine: ముందు నాగచైతన్యతో విడాకులు తరువాత మాయోసైటిస్ అనే జబ్బుతో బాధ పడుతూ వార్తల్లోకి ఎక్కిన సమంత ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తోంది. ఏడాది పాటు సినిమాలకి బ్రేక్ తీసుకుంటున్నట్టు మీడియాకి లీకులిచ్చి హాట్ టాపిక్ అయిన ఈ భామ ఇప్పుడు తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేసిన ఫోటోలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. తన టిబెట్ విహారయాత్రను ప్రారంభించే ముందు, సమంతా ఫ్యాషన్ మ్యాగజైన్ అయిన ‘బజార్’ కోసం ఒక హాటెస్ట్ ఫోటోషూట్ పూర్తి చేసింది. ఆమె ఈ మ్యాగజైన్ కోసం నలుపు రంగు V-ప్లంజ్ మోనోకినిలో దర్శనం ఇచ్చింది. ఇక ఈ మోనోకినిలో ఆమె తన టోన్డ్ బాడీ మొత్తాన్ని చూపించీ చూపించకుండా టీజ్ చేస్తూ రెచ్చిపోయింది. ఇక ఈ మ్యాగజైన్ కోసం ఆమె ఒక ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. ఈ షూట్ నుండి బాక్ మోనోకిని ఫోటోను సమంత గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది.

Singham Again : వైరల్ అవుతున్న కరీనా కపూర్ ఫస్ట్ లుక్..

అదనంగా, ఆమె మ్యాగజైన్ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూలో కొంత భాగాన్ని పంచుకుంది. తన వ్యక్తిగత నష్టాలను మీడియాలో, సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేయడం వల్ల తాను డిప్రెషన్‌కు గురికావడం లేదని పేర్కొంది. “ఈ దేశంలో లవబుల్ స్టార్‌గా ఉండటం ఒక అద్భుతమైన బహుమతి అని గుర్తించడం చాలా ముఖ్యం అని ఆమె అన్నారు. దానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని, నిజాయితీగా -వాస్తవికంగా ఉండాలని ఆమె అన్నారు. ఎవరైనా ఎన్ని సూపర్ హిట్‌లు, బ్లాక్‌బస్టర్‌లను కలిగి ఉన్నా, ఎన్ని అవార్డులు గెలుచుకున్నా, పరిపూర్ణమైన శరీరం లేదా అత్యంత అందమైన దుస్తుల గురించి కాదు బాధ, కష్టాలు, లో మూమెంట్స్ లో ఎలా హ్యాండిల్ చేస్తాం అనే దానిపై ఆధారపడి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. నా లో మూమెంట్స్ లు చాలా పబ్లిక్‌గా ఉన్నాయని నేను పట్టించుకోను, నిజానికి వాటి ద్వారా నాకు చాలా బలం వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది.

Exit mobile version