Site icon NTV Telugu

సమంత న్యూఇయర్ సెలబ్రేషన్ ప్లాన్ ఇదేనట !

samantha

సౌత్ స్టార్ హీరోయిన్ ఈ ఏడాది హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిన హీరోయిన్లలో ఒకరు. సామ్ ఇప్పుడు నూతన సంవత్సరం 2022ని స్వాగతించడానికి ఉత్సాహంగా ఉన్నారు. 2021లో సమంత మొదటి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ విడుదలై సంచలనం సృష్టించింది. తరువాత ఈ ఏడాది అక్టోబర్ లో ఆమె విడాకుల కారణంగా చాలా రోజులు వార్తల్లో నిలిచింది. అనంతరం ఓ ఇంటర్నేషనల్ మూవీకి సైన్ చేయడమే కాకుండా ‘పుష్ప’లోని ఐటమ్ సాంగ్ తో అందరినీ అదరగొట్టేసింది. వచ్చే ఏడాది కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ గంటలు లెక్కబెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సెలెబ్రిటీలు ఏ విధంగా న్యూఇయర్ ను సెలెబ్రేట్ చేసుకోబోతున్నారు ? అనే విషయం తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. అందరి లాగే సామ్ కూడా న్యూఇయర్ సెలెబ్రేషన్స్ ను ఎలా చేసుకోబోతోంది ఓ నేషనల్ మీడియాకు వెల్లడించింది.

https://ntvtelugu.com/attasudake-lyrical-video-song-from-khiladi/

సమంతా ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ న్యూఇయర్‌ రోజు తన సన్నిహితులతో గడపాలని ఎదురు చూస్తున్నానని తెలిపింది. ఆమె మాట్లాడుతూ “ఏడాది పొడవునా నన్ను హ్యాపీగా ఉంచిన గొప్ప స్నేహితులు నాకు ఉన్నారు. కాబట్టి నేను వారితో, నా కుక్కలతో, ముఖ్యంగా నా తల్లితో సమయం గడపాలని ఎదురు చూస్తున్నాను. ఈ సంతోషకరమైన సమయంలో వారితో గడపడం అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. కాగా సమంత ఇప్పటికే తన తరువాత చిత్రం ‘శాకుంతలం’ షూటింగ్‌ను ముగించింది. త్వరలో విడుదల తేదీని మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సామ్ టైటిల్ రోల్ పోషిస్తోంది. ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించిన ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్‌’లో కూడా సమంత కనిపించనుంది. అంతే కాకుండా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాతు వాకుల రెండు కాదల్’ అనే ప్రాజెక్ట్‌లో నయనతార, విజయ్ సేతుపతితో పాటు సమంత కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇది ఫిబ్రవరి 2022లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version