Samantha: సింగిల్స్‌కు సమంత పవర్‌ఫుల్ అడ్వైజ్.. ఆ ఒక్క క్వాలిటీ ఉంటేనే ఓకే చెప్పండి!

Raj Nidimoru Samantha

Raj Nidimoru Samantha

Samantha: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు రిలేషన్‌షిప్స్, లైఫ్ పార్ట్‌నర్ ఎంపికపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన చిత్ర సక్సెస్ మీట్‌లో సమంత పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె.. మహిళలకు లైఫ్ పార్ట్‌నర్ ఎంపికపై ఒక కీలకమైన సలహా ఇచ్చారు. “రిలేషన్‌షిప్స్ అనేవి ఒక్కరి చేతుల్లో ఉండవు, ఇద్దరూ కలిసి కృషి చేయాలి. ముఖ్యంగా మహిళలు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు.. మీ విజయాన్ని చూసి ఈర్ష్య పడకుండా, గర్వంగా చెప్పుకునే, సంతోషంగా సెలబ్రేషన్స్ చేసుకునే వ్యక్తిని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి” అంటూ సమంత స్పష్టం చేశారు.

గతంలో తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనుభవాలను తట్టుకుని, ఎంతో ధైర్యంగా నిలబడిన సమంత.. ఇప్పుడు రిలేషన్స్‌పై ఇలాంటి బోల్డ్ స్టేట్‌మెంట్ ఇవ్వడంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే ఈవెంట్‌లో సమంత తన ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న వార్తలన్నింటికీ ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చింది. “ఎవరికైనా ఇంత మంచి సక్సెస్ వచ్చాక గ్యాప్ తీసుకోకుండా వరుస సినిమాలు చేయాలనుకుంటారు, మీరేమనుకుంటున్నారు?” అని ఒక విలేకరి ప్రశ్నించగా.. “సారీ అండి, మరోసారి గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది. నేను మెటర్నిటీ లీవ్ తీసుకోవాలి” అని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో సమంత త్వరలో తల్లి కాబోతోందనే వార్త ఆమె నోటి ద్వారానే వినడంతో అభిమానులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

×
×
Ad