Samantha: సింగిల్స్‌కు సమంత పవర్ఫుల్ అడ్వైజ్.. ఆ ఒక్క క్వాలిటీ ఉంటేనే ఓకే చెప్పండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు రిలేషన్షిప్స్, లైఫ్ పార్ట్నర్ ఎంపికపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన చిత్ర సక్సెస్ మీట్లో సమంత పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె.. మహిళలకు లైఫ్ పార్ట్నర్ ఎంపికపై ఒక కీలకమైన సలహా ఇచ్చారు. “రిలేషన్షిప్స్ అనేవి ఒక్కరి చేతుల్లో ఉండవు, ఇద్దరూ కలిసి కృషి చేయాలి. ముఖ్యంగా మహిళలు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు.. మీ విజయాన్ని చూసి ఈర్ష్య పడకుండా, గర్వంగా చెప్పుకునే, సంతోషంగా సెలబ్రేషన్స్ చేసుకునే వ్యక్తిని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి” అంటూ సమంత స్పష్టం చేశారు.
గతంలో తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనుభవాలను తట్టుకుని, ఎంతో ధైర్యంగా నిలబడిన సమంత.. ఇప్పుడు రిలేషన్స్‌పై ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే ఈవెంట్లో సమంత తన ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న వార్తలన్నింటికీ ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చింది. “ఎవరికైనా ఇంత మంచి సక్సెస్ వచ్చాక గ్యాప్ తీసుకోకుండా వరుస సినిమాలు చేయాలనుకుంటారు, మీరేమనుకుంటున్నారు?” అని ఒక విలేకరి ప్రశ్నించగా.. “సారీ అండి, మరోసారి గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది. నేను మెటర్నిటీ లీవ్ తీసుకోవాలి” అని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో సమంత త్వరలో తల్లి కాబోతోందనే వార్త ఆమె నోటి ద్వారానే వినడంతో అభిమానులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!