Samantha Ruth Prabhu Manager Reacts On Rumours: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సినీ తారల్లో సమంత ఒకరు. తన సినిమాల అప్టేడ్స్‌తో పాటు అప్పుడప్పుడు వ్యక్తిగత విషయాలనూ పంచుకుంటుంది. తనపై ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే.. అప్పటికప్పుడు కౌంటర్లు ఇవ్వడానికైనా వెనుకాడదు. అలాంటి సమంత.. కొంతకాలం నుంచి నెట్టింట్లో యాక్టివ్‌గా లేదు. తన గురించి కాదు కదా, కనీసం రిలీజ్‌కి సిద్ధమవుతున్న తన చిత్రాలపై కూడా సమంత నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. అటు.. పబ్లిక్‌లో కూడా కనిపించడం లేదు. దీంతో.. సమంత అనారోగ్యం పాలైందన్న వార్తలు ఊపందుకున్నాయి. అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతోందని, దానికి చికిత్స చేయించుకోవడం కోసం అమెరికా వెళ్లిందని పుకార్లు షికారు చేయడం మొదలయ్యాయి. ఇదే సమయంలో సమంతకి చర్మ వ్యాధి లేదని, కేవలం సర్జరీ కోసం వెళ్లిందని మరో వార్త కూడా హల్‌చల్ చేసింది.
అయితే.. తాజాగా ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని సమంత మేనేజర్ మహేంద్ర స్పందించాడు. చర్మ వ్యాధి చికిత్స కోసం లేదా సర్జరీ కోసం సమంత విదేశాలకు వెళ్లిందని వస్తోన్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశాడు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఎలాంటి అనారోగ్యానికి గురవ్వలేదని వెల్లడించాడు. ఇవన్నీ పుకార్లేనని, వాటిని ఎవరూ నమ్మొద్దని క్లారిటీ ఇచ్చాడు. ఇలాంటి వార్తలు ఎక్కడినుంచి పుట్టుకొస్తున్నాయో కూడా తెలియడం లేదని, నిజానిజాలు తెలుసుకోకుండా వార్తలు రాయొద్దని సూచించాడు. అయితే.. సమంత ఎక్కడుంది? ఏం చేస్తోంది? ఎందుకు అజ్ఞాతంలో ఉంది? అనే విషయాలపై మాత్రం ఆమె మేనేజర్ క్లారిటీ ఇవ్వలేదు. కాగా.. సమంత ప్రస్తుతం యశోద, శాకుంతలం సినిమాల్లో నటిస్తోంది. ఆ రెండు చిత్రాల చిత్రీకరణలు పూర్తవ్వగా.. అవి విడుదలకు ముస్తాబవుతున్నాయి. అటు.. హిందీలో ఓ వెబ్‌సిరీస్ కూడా చేస్తోన్న సమంత, ఆయుష్మాన్ ఖురానా సరసన ఓ హారర్ కామెడీతో బాలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.
