Samantha Ruth Prabhu and Naga Chaitanya at Amazon Prime Video Event: ఏం మాయ చేసావే సినిమా షూటింగ్ సమయంలో సమంత, నాగచైతన్య ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. వాస్తవానికి ఇది సమంతకి మొదటి సినిమా కాగా నాగచైతన్యకి రెండో సినిమా. ఈ సినిమా సమయంలో వారికి ఏర్పడిన పరిచయం ముందు స్నేహంగా తర్వాత ప్రేమగా మారింది. ఇద్దరూ తమ పెద్దలను ఒప్పించి గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా చేసుకున్నారు. అయితే ఏమైందో ఏమో తెలియదు వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. ఆ తర్వాత సమంత మీద పెద్ద ఎత్తున నెగెటివిటీ పెరిగి నాగచైతన్య ఫ్యాన్స్ నుంచి భారీ ట్రోలింగ్ జరిగింది. ఈ అంశం మీద కోర్టు వరకు వెళ్లి కేసులు కూడా పెట్టుకోగా తరువాత పరిస్థితి సద్దుమణిగింది. అయితే ఆ తర్వాత వీరిద్దరూ బహిరంగంగా ఒకరి గురించి ఒకరు మాట్లాడడం కానీ ఎదురు పడడం కానీ జరిగిన విషయం మీడియా దృష్టికి రాలేదు.
Laya: 14 ఏళ్ళ తరువాత రీ ఎంట్రీ ఇస్తున్న లయ.. కుర్ర హీరోకి అక్కగా!
ఏదైనా పర్సనల్ ఈవెంట్స్ లో కలిసి ఉండవచ్చు కానీ బహిరంగంగా మాత్రం ఒకరికొకరు ఎదురు పడటం లేదా ఓకే ఈవెంట్ కి ఇద్దరు హాజరు కావడం జరగలేదు. అయితే తొలిసారిగా వీరిద్దరూ ఒకే కార్యక్రమానికి హాజరయ్యారు. ఒకే వేదిక మీద వేరువేరు సమయాలలో తమ ప్రాజెక్టులను ప్రమోట్ చేసుకున్నారు. ముంబై వేదికగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా కంటెంట్ ని ఈరోజు అనౌన్స్ చేసింది. ఈ క్రమంలోనే పలు సినిమా యూనిట్స్ వెబ్ సిరీస్ యూనిట్స్ ఈవెంట్ కి హాజరై తమ ప్రాజెక్టులను అనౌన్స్ చేశారు. ముందుగా నాగచైతన్య హాజరై దూత వెబ్ సిరీస్ కి సీక్వెల్ గా దూత 2 త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లోకి రాబోతుందని ప్రకటించగా ఆ తర్వాత నాలుగు ప్రాజెక్టులు ప్రకటించిన అనంతరం సమంత స్టేజ్ మీదకు వచ్చి సిటాడెల్ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ ని ప్రమోట్ చేసుకుంది. అంటే వేరు వేరు సమయాల్లో వారు తమ తమ ప్రాజెక్టులను ప్రమోట్ చేసుకున్నారు. ఇక ఈ క్రమంలో ఒకరి కొకరు ఎదురుపడ్డారు లేదో తెలియదు కానీ వీరిద్దరూ ఒకే స్టేజి వేరువేరు సమయాలలో పంచుకున్న వీడియోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.