NTV Telugu Site icon

Samantha: చైతన్యతో విడాకులు.. ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నా

Sam

Sam

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. మొదటి నుంచి కూడా ఆమె గురించిన వార్త ఏది వచ్చినా అది సెన్సేషన్ గా మారుతూనే వస్తుంది. ఇక సామ్.. చైతు విడిపోయాకా ఆ వార్తలు మరింత ఎక్కువ అయ్యాయి. అంగరంగ వైభవంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లు కూడా నిండకముందే విడాకులు తీసుకొని విడిపోయారు. విడిపోయాక సమంత మీద వచ్చిన ట్రోల్స్ అన్ని ఇన్ని కాదు. విడాకుల్లకు కారణం సమంత బిహేవియర్ అని, ఆమె వలన అక్కినేని ఫ్యామిలీ పరువు పోయిందని ఇష్టంవచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఈ ట్రోల్స్ పై సామ్ తనదైన రీతిలో స్పందిస్తూనే వస్తుంది. ఇక మరోసారి ఆనాటి రోజులను గుర్తుకు తెచ్చుకొని ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం సామ్ నటిస్తున్న శాకుంతలం సినిమా రిలీజ్ కు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమా విషయాలతో పాటు పర్సనల్ విషయాలను కూడా పంచుకుంది.

Kane Williamson: కేన్ విలియమ్సన్‌పై గుజరాత్ టైటాన్స్ బాంబ్.. ఆ భయమే నిజమైంది!

విడాకుల తరువాత మీపై చాలా ట్రోల్స్ వచ్చాయి కదా.. ఆ సమయంలో మీరు ఎలా వాటిని ఫేస్ చేశారు అన్న ప్రశ్నకు సామ్ మాట్లాడుతూ.. ” అవి నా జీవితంలో చీకటి రోజులు.. పిచ్చి పిచ్చి ఆలోచనలు వాస్తు ఉండేవి. నిద్ర పట్టేది కాదు. ఇక ఆ ఆలోచనలతో నా జీవితం నాశనం అవ్వకూడదని అనుకున్నాను. నా మనసుకు నచ్చిన పనిచేయడం మొదలు పెట్టా.. నా కుటుంబం, నా ఫ్రెండ్స్ అందరు నాకు సపోర్ట్ గా నిలిచారు. అది నా అదృష్టం. కానీ, ఇప్పటికీ ఆ బాధ నుంచి నేను ఇంకా కోలుకోలేకపోతున్నా. అయితే అప్పటికన్నా ఇప్పుడు కొద్దిగా ఆ చీకటి రోజులు తగ్గాయనే చెప్పాలి. కిష్టపరిస్థితులు ఎదురైనప్పుడు అందులోనే చిక్కుకుపోకూడదు” అని చెప్పుకొచ్చింది. మరి సామ్.. ఈ శాకుంతలం సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలంటే ఏప్రిల్ 14 వరకు ఆగాల్సిందే.

Show comments