NTV Telugu Site icon

Samantha: చైతూ కంటే ముందు అతని లవ్ లోనే ఉన్నా.. అసలు సంగతి బయట పెట్టేసిన సమంత

Samantha Ruthprabhu

Samantha Ruthprabhu

Samantha Reveals her first Love before Nagachaitanya:స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్ళి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాలు నేపథ్యంలో వీరు విడాకులు కూడా తీసుకున్నారు. అయితే మీరు విడాకులు జరిగిన ఇన్నాళ్ల తర్వాత కూడా వారి గురించిన వార్తలు ఎప్పుడో ఒకప్పుడు తెరమీదకి వస్తూనే ఉన్నాయి. తాజాగా సమంత తన ఫస్ట్ లవ్ గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది. నాగ చైతన్య కంటే ముందే ఆమె ఒకరిని ప్రేమించినట్టు ఆమె పేర్కొంది. తన మొదటి సినిమా హీరోనే సమంత పెళ్లి చేసుకుంది. నాగ చైతన్య-సమంతల ప్రేమ పెళ్లి 2014లో గోవాలో ఘనంగా జరిగింది. మనస్పర్థలు తలెత్తడంతో నాలుగేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పి 2021లో విడాకులు తీసుకున్నారు వీరిద్దరూ. అయితే సమంతకు నాగ చైతన్యతో ఫస్ట్ లవ్ కాదని అంతకు ముందే ఆమె ఒకరిని ప్రేమించినట్టు వెల్లడించింది.

Prashanth Varma : ఆ వెర్షన్ లో రిలీజ్ కానున్న హనుమాన్ మూవీ.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రశాంత్ వర్మ..

సమంత చదువుకునే రోజుల్లో చెన్నైలో పల్లవరం నుండి టీనగర్ వెళ్ళడానికి రెండు బస్సులు మారాల్సిన క్రమంలో ఒక అబ్బాయి రోజూ సమంత కోసం బస్ స్టాప్ వద్ద కాపు కాసేవాడు అని చెప్పుకొచ్చింది. సమంతను స్కూల్ వరకు ఫాలో అయ్యేవాడు కానీ ఎప్పుడూ దగ్గరకు రాలేదని ఆమె చెప్పుకొచ్చింది. కొన్ని అడుగుల దూరం మైంటైన్ చేస్తూ ఫాలో అయ్యేవాడని ఆమె చెప్పుకొచ్చింది. రెండేళ్లుగా ఫాలో అవుతున్న అతని వద్దకు వెళ్లి… ఎందుకు నా వెనకాల పడుతున్నావ్… అని ఒకరోజు అడిగితే కంగారుపడి. నేను నిన్ను ఫాలో కావడం ఏంటీ, అదేమీ లేదని అన్నాడట.. దాంతో సమంత తాను షాక్ అయ్యానని చెప్పుకొచ్చింది. అది ప్రేమో కాదో తెలియదు కానీ అదే తన ఫస్ట్ లవ్ అని సమంత చెప్పుకొచ్చింది. సమంత మాటలను బట్టి చూస్తే సమంత కూడా అతన్ని ఇష్టపడింది కానీ బహుశా ఆ వ్యక్తి పిరికివాడు కావడంతో ధైర్యం చేసి ఆమెకి తన ప్రేమ చెప్పలేకపోయాడు.. అదండీ సంగతి అలా సమంత మొదటి లవ్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Show comments