Samantha: స్టార్ హీరోయిన్ సమంత ఒక ఏడాది నుంచి రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. మయోసైటిస్ వ్యాధితో చికిత్స తీసుకుంటున్న సమంత.. దాంతో పాటు మానసిక ప్రశాంతత కోసం షూటింగ్స్ కు ఒక ఏడాది ఫుల్ స్టాప్ పెట్టింది.ఇక ఈ రెస్ట్ మోడ్ ను వెకేషన్ మోడ్ గా మార్చుకొని ప్రపంచం మొత్తం తిరిగేస్తుంది. వెండితెరపై కనిపించకపోయినా కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. నిత్యం ఆమె చేసే పనులు, చూసిన ప్రదేశాల గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా హాట్ హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్యనే షూటింగ్స్ స్టార్ట్ చేసిన సామ్.. నేడు వాలెంటైన్స్ డే కు అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ మధ్యకాలంలో పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్స్ ఎక్కువ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు వాటిపై మక్కువ చూపిస్తున్నారు. పాడ్‌క్యాస్ట్‌లు రేడియో ప్రసారాల మాదిరిగానే ఉంటాయి. పాడ్‌క్యాస్ట్ అనేది మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లోని వెబ్‌సైట్ లేదా యాప్ లో ఆడియో, వీడియో ఏదైనా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.కేవలం దాన్ని సబ్ స్క్రైబ్ చేసుకుంటే చాలు.
ఇక తాజాగా సామ్ టేక్ 20 అనే పాడ్ క్యాస్ట్ ను ప్రారంభించింది. ఇందులో కేవలం హెల్త్ గురించిన విషయాలు మాత్రమే ఉంటాయని చెప్పుకొచ్చింది. ఈ మూడేళ్ళుగా తాను అనుభవించిన బాధ, మయోసైటిస్ నుంచి తాను ఎలా కోలుకున్నది అన్ని చెప్పుకొచ్చింది. ఈ టేక్ 20 లో హై క్వాలిటీ వెల్ నెస్ కంటెంట్ ఉంటుందని, అది అందరి జీవితాలను మార్చే విధంగా ఉంటుందని తెలిపింది. ఇందులో చెప్పేవి అన్ని ఎన్నో సంవత్సరాలు రీసెర్చ్ చేసినవని, అనుభవజ్ఞుల నుంచి తీసుకున్నవని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను సామ్.. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా రిలీజ్ చేసింది. త్వరలోనే ఫుల్ వీడియో రానుంది. ఇక సినిమాలు విషయానికొస్తే.. ప్రస్తుతం సామ్ సిటాడెల్ చేస్తోంది.
