Site icon NTV Telugu

Samantha : బుజ్జితల్లి కాస్త నవ్వే.. సమంత – చైతన్య వీడియో… నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్

naga chaitanya

naga chaitanya

Samantha Naga Chaitanya Edited Video goes Viral: అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయి చాలా కాలం అవుతుంది. అయితే వారు విడాకులు తీసుకున్నప్పటి నుంచి వీరి గురించి ఏ వార్త వచ్చిన వెంటనే వైరల్ గా మారుతోంది. ఇప్పటికే ఈ జంటపై ఎన్నో రూమర్స్ పుట్టుకొచ్చాయి. వీళ్లు మళ్లీ కలుస్తారని.. అందుకే రెండో పెళ్లి చేసుకోకుండా వేరేగా ఉంటున్నారంటూ ప్రచారాలు సాగుతున్నాయి. ఆ విషయం పక్కన పెడితే తాజాగా సమంత – నాగచైతన్యకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత నాగచైతన్య మ్యూచువల్ ఫ్యాన్స్ దీనిని క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఒకే వీడియోలో సమంత నాగచైతన్య కనిపిస్తారు. అయితే అది ఎడిట్ వీడియో అయినప్పటికీ… చూస్తుంటే మస్తు ఫీల్ వచ్చేస్తుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే… బుజ్జి తల్లి వచ్చేస్తున్నా కదే.. కాస్త నవ్వే.. అంటూ నాగచైతన్య ఈ డైలాగ్ తండేల్ సినిమా కోసం చెప్పింది.

SP Charan: తరుణ్ భాస్కర్ పై కోర్టుకెళ్లిన ఎస్పీ చరణ్.. డిమాండ్స్ ఇవే

ఇక అలా చైతూ చెప్పగా వెంటనే సమంత బాగా ఎమోషనల్​ అయి ఏడ్చేస్తుంది. శాకుంతలం సినిమా ప్రమోషనల్ లో ఎమోషనల్ అయిన వీడియోను ఇక్కడ ప్లేస్ చేశారు. మొత్తానికి ఇద్దరి ఫీలింగ్స్ ​ను అద్భుతంగా చూపిస్తూ వీడియోను ఎడిట్ చేశారు సామ్ చై డై హార్డ్ ఫ్యాన్స్. ఒక సెకండ్ ఇది నిజమే అన్నట్టు ఫీల్ కలుగుతుంది. ప్రస్తుతం ఈ వీడియోకు లక్షల కొద్ది వ్యూస్, వేల కొద్ది కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఇక ఈ వీడియో క్లిప్ చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ కూడా వీరు మళ్లీ కలిస్తే బాగుంటూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమాతో బిజీగా ఉండగా.. సమంత మాత్రం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మరి వీరు కలుస్తారో లేదో తెలియదు కానీ వీరి వార్తలు మాత్రం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.

Exit mobile version