Samantha: సౌత్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సామ్ గతకొన్ని రోజుల నుంచి సైలెంట్ అయిపోయింది. దీంతో ఆమెకు ఏమయ్యిందో అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆమె ఎందుకు సైలెంట్ గా ఉంటుందో తెలియదు కానీ రోజుకో వార్త మాత్రం ఇది కారణమంటూ వచ్చేస్తోంది. కొంతమంది ట్రోలర్స్ బాధ పడలేక రావడం లేదన్నారు. మరికొందరు సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండడం వలన రావడం లేదన్నారు. ఇంకొంతమంది ఆమె సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుందని, మరికొంతమంది బాలీవుడ్ హీరో ఎవరో చెప్పారని, అందుకే సైలెంట్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక్కడి వరకు ఓకే కానీ.. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ మాత్రం మరీ దిగజారి ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది.
సామ్ కు అస్వస్థత అని, ఆమె ఒక చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతుందని, అందుకే బయటకు రావడం లేదని థంబ్ నెయిల్స్ పెట్టి నానా రచ్చ చేశారు.
ఇక ఈ విషయం సామ్ మేనేజర్ వరకు వెళ్లడంతో ఆయన స్పందించక తప్పలేదు. సమంత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, తప్పుడు ప్రచారాలు చేయకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామ్ షూటింగ్లతో బిజీగా ఉందని, ఆమెకు ఎటువంటి వ్యాధులు లేవని స్పష్టం చేశాడు. ఇక కావాలనే కొంతమంది సామ్ ను టార్గెట్ చేసి ఇలాంటి సృష్టిస్తున్నారని, వారిపై సామ్ లీగల్ యాక్షన్ తీసుకోనున్నదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. హద్దుమీరి మరీ ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నవారికి ఇలాగే జరగాలని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
