Maa Inti Bangaram: మా ఇంటి బంగారం పరిస్థితి ఏంటి ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఖుషి’ తర్వాత గ్యాప్ తీసుకొని ‘మా ఇంటి బంగారం’ అంటూ వస్తున్న సమంత, పెద్దగా కాంపిటీషన్ లేని సమ్మర్ సీజన్ ని వదిలేసుకుంది. మే 15న రిలీజ్ కావల్సిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్, జూన్ 19 కి పోస్ట్‌పోన్ అయింది. కానీ ఇప్పుడు నాలుగైదు సినిమాలతో పోటీ పడాల్సి వస్తుంది. ‘ఖుషి’ తర్వాత టాలీవుడ్ ఆడియన్స్ తో కాస్త గ్యాప్ తీసుకున్న సమంత, సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు ‘మా ఇంటి బంగారం’తో వచ్చేస్తుంది. మే 15న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ బొమ్మ కొన్ని రీజన్స్ తో తప్పుకుంది. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తుంది, కానీ సామ్ నాలుగైదు సినిమాలతో పోటీ పడాల్సిన పరిస్థితి.
సామ్ ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ అండ్ డెబ్యూ హీరో హర్షిత్ రెడ్డి ఇప్పుడు ఆమెకు పోటీగా మారాడు. అతడు నటించిన ‘దీవానా’ కూడా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 90స్ లో అమ్మాయిల క్రష్ హీరోగా మారిన వడ్డే నవీన్, 10 ఏళ్ల తర్వాత కనిపించబోతున్న ఫిలిం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. ఈ సినిమాను వడ్డే నవీన్ నిర్మిస్తున్నాడు. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ మూవీ. అలాగే డబ్బింగ్ చిత్రాలు కూడా సమంత మూవీని టార్గెట్ చేయబోతున్నాయి. విజయ్ ఆంటోని, స్వాసిక లీడ్ రోల్ పోషిస్తున్న ‘నూరు సామి’ని ఇక్కడ ‘100 దేవుళ్లు’గా రిలీజ్ చేస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్ హౌస్ మలయాళంలో తెరకెక్కించిన ఫిలిం ‘బాలన్ ది బాయ్’. ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫేమ్ చిదంబరం డైరెక్టర్, జీతూ మాధవన్ కథ అందించాడు. ఈ సినిమా జూన్ 19న రిలీజ్ కాబోతుంది, తెలుగులోనూ ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ అదే రోజు విడుదల చేస్తుంది.
Also Read
ఇవే కాకుండా చిన్నా చితకా సినిమాలు, ‘గౌతమ్ నంద’ రీ-రిలీజ్ కూడా సామ్ ‘మా ఇంటి బంగారం’తో పోటీ పడుతున్నాయి. మూవీ మే 15న రిలీజ్ అయి ఉంటే ‘కరుప్పు’ ఒక్కటే కాంపిటీషన్ అయి ఉండేది. మరే సినిమా లేదు కాబట్టి ‘కరుప్పు’ని టాలీవుడ్ ఆడియన్స్ ఆదరించారు. కానీ, ‘మా ఇంటి బంగారం’ కంటెంట్ బాగుంటే ఐపీఎల్, సమ్మర్ కూడా లెక్క చేసేవారు కాదేమో. ఇప్పుడైనా టాక్ బాగుంటే చూస్తారు, కానీ కలెక్షన్స్ ఎఫెక్ట్ ఖచ్చితంగా కనబడుతుంది. మరి ఈ శుక్రవారం ఏ మూవీ విన్నర్ అవుతుందో లెట్స్ వెయిట్.
తాజావార్తలు
-
Rahul Gandhi: పెల్లెట్ గన్ రగడ.. రాహుల్, ప్రియాంకా గాంధీల మెరుపు ధర్నా..
-
Zodiac Signs : బుధ నక్షత్ర మార్పు.. ఆ 4 రాశుల వారికి సవాళ్లు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
Gadikota Srikanth Reddy: అన్ని ప్రాంతాల్లో కరువు జాడ..! ముందుచూపుతో వ్యవహరించండి-గడికోట శ్రీకాంత్ రెడ్డి
-
CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
-
India vs Sri Lanka Test: 10 వికెట్ల సుతార్, సారాంశ్ జైన్ రాక.. కొలంబో టెస్ట్ తుది 11పై ఉత్కంఠ
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!