NTV Telugu Site icon

Samantha: ఆ స్పై థ్రిల్లర్ లో సమంత లేనట్లేనా!?

Sai

Sai

Samantha: స్టార్ హీరోయిన్ సమంత మయోసిటిస్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తన ఆరోగ్య స్థితి గురించి సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో సమంత ఇక సినిమాలు మానేస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. జనవరి నుంచి ‘ఖుషి’ షూటింగ్ మొదలు పెట్టి పూర్తి చేస్తుందని, మిగతా కమిట్ అయిన ప్రాజెక్ట్ ల నుంచి తప్పుకోనుందని వినిపించింది. అయితే దీనిని సమంత మేనేజర్ ఖండించినట్లు కూడా కొన్ని సోషల్ మీడియా సంస్థలు ప్రచురించాయి. వీటిలో నిజానిజాలు ఏమిటన్నది అధికారికంగా తెలియపర్చలేదు.

ఇదిలా ఉంటే అమెజాన్ ప్రైమ్ వీడియో ఇటీవల చేసిన ఓ ట్వీట్ ఖచ్చితంగా సమంత అభిమానులకు ఆందోళనకు కలిగించేదే. ఇదే ఏడాది బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్, సమంత స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ కోసం జతకట్టబోతున్నట్లు ప్రకటన వచ్చింది. ఈ యాక్షన్ సీరీస్ లో ఇద్దరూ గూఢచారులుగా కనిపిస్తారని వినిపించింది. అమెజాన్ ప్రైమ్ అధికారికంగా సిరీస్ లో వరుణ్ ధావన్ పాత్రను రివీల్ చేస్తూ జనవరి 2023 నుండి షూట్ ప్రారంభమవుతుందని ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ కి వరుణ్ ధావన్, రాజ్-డికెతో పాటు ఇతర సాంకేతికనిపుణులను ట్యాగ్ చేసింది. కానీ సమంతను మాత్రం ట్యాగ్ చేయలేదు. దీనిని బట్టి అమెజాన్ ప్రైమ్, రాజ్-డికె కలిసి చేస్తున్న ఈ వెబ్ సిరీస్ నుండి సమంత తప్పుకున్నట్లు స్పష్టం అవుతుందని అంటున్నారు. సమంత స్థానంలో కొత్త హీరోయిన్ ఎవరనే విషయంపై కూడా అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. చూడాలి మరి సమంత ప్లేస్ లో ఎంపిక అయ్యే హీరోయిన్ ఎవరో!?