Site icon NTV Telugu

Samantha: సామ్.. మళ్లీ మొదలుపెట్టేసావా.. ఇక వాళ్లేందుకు ఆగుతారు

Samanta

Samanta

Samantha:స్టార్ హీరోయిన్ సమంత ఒక ఏడాది నుంచి రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. మయోసైటిస్ వ్యాధితో చికిత్స తీసుకుంటున్న సమంత.. దాంతో పాటు మానసిక ప్రశాంతత కోసం షూటింగ్స్ కు ఒక ఏడాది ఫుల్ స్టాప్ పెట్టింది.ఇక ఈ రెస్ట్ మోడ్ ను వెకేషన్ మోడ్ గా మార్చుకొని ప్రపంచం మొత్తం తిరిగేస్తుంది. వెండితెరపై కనిపించకపోయినా కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. నిత్యం ఆమె చేసే పనులు, చూసిన ప్రదేశాల గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక ఈ మధ్యనే రెస్ట్ మోడ్ నుంచి వర్క్ మోడ్ కు వచ్చేసింది. విడాకుల తరువాత నుంచి ఈ చిన్నది ట్రోల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఆమె ఏది చేసినా ట్రోల్ చేసేవాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు.

హెల్త్ బాగోకపోయినా .. ఫుడ్, హాస్పిటల్, పబ్ .. ఇలా సామ్ ఎక్కడ కనిపించినా నెగెటివ్ కామెంట్స్ చేసేవాళ్ళే ఎక్కువ. ఇక వారిని లెక్కచేయకుండా సామ్.. తనకు నచ్చినట్లుగా ఉంటుంది అనుకోండి. అయితే ఈ చిన్నది హాట్ హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. పెళ్ళికి ముందు ఎలా ఉన్నా పట్టించుకోని ట్రోలర్స్.. విడాకుల తరువాత మాత్రం కొద్దిగా హాట్ డ్రెస్ లో కనిపించినా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ భామ.. మరోసారి ట్రోలర్స్ కు పని చెప్పింది. హద్దుమీరిన అందాల ఆరబోత చేసి ఔరా అనిపించింది. బ్లాక్ అండ్ బ్లాక్ సూట్ లో ఎద అందాలను ఆరబోసి..కుర్చీలో కూర్చొని ఓరగా చూస్తూ కనిపించింది. ఇక ఇంకేముంది.. ట్రోలర్స్ ఆగుతారా.. ? సామ్.. మళ్లీ మొదలుపెట్టేసావా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక సామ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సిటాడెల్ హానీ బన్నీ లో నటిస్తోంది.

Exit mobile version