Site icon NTV Telugu

Samantha Hoopes: ఆ స్విమ్ షూట్ ‘ఫ్రెండ్షిప్ బ్రాస్లెట్’ లాంటిదట!

Samantha

Samantha

Samantha Hoopes: సమంతా హూప్స్ – ఈ పేరు వింటే చాలు కుర్రాళ్ళ గుండెలు లయ తప్పుతాయి. సమంతా హూప్స్ స్టార్ హీరోయిన్ ఏమీ కాదు, కానీ, కేవలం తన పిక్స్ తోనే యువకుల హృదయాలకు చిల్లుపెట్టేది. 2014 మొదలు 2020 వరకు సమంతా హూప్స్ స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ స్విమ్ షూట్ ఇష్యూకు మోడల్ గా ఉంది. ఆ సమయంలో అమ్మడు రకరకాల స్విమ్ షూట్స్ తో మతిపోగొట్టేది. ముఖ్యంగా 2020లో కేవలం దారాలతో చేసిన పురకోసల వంటి స్విమ్ షూట్ లో సమంతా హూప్స్ ఫోజులు ఇచ్చిన తీరును ఎవరూ మరచిపోలేరు.

Kathryn Hahn: మార్వెల్ స్టార్ కు ‘అలా’ ఉండడమే ఇష్టమట!!

నూలుపోగులతో చేసిన స్విమ్ షూట్ చూడటానికి పైన రెండు, కింద రెండు దారాలలాగే కనిపించినా, అందులో ఎంతో పనితనం ఉందని సమంత అంటోంది. ఆ దుస్తులు ధరించినప్పుడు తనకు చెప్పలేని హాయి కలిగిందనీ వివరిస్తోంది. తన ఫోటోలు చూసి తనకే ఆశ్చర్యమేసిందని, ఇక యువకులు ఊపిరి పీల్చుకోవడమే మరచిపోయి ఉంటారనీ అంటోంది. “ఆ స్విమ్ షూట్ తనకు ఓ ఫ్రెండ్షిప్ బ్రాస్లెట్ లాంటిది” అంటూ మురిసిపోతోంది. కెమెరామేన్ జోసీ తనను ఎంతో కంఫోర్టబుల్ ఫేజ్ లో ఉంచి తనకు కావలసిన ఫోటోస్ తీసుకున్నారనీ, వాటిని ఎప్పుడు చూసినా ఆనందంగానే ఉంటుందనీ చెబుతోంది. తన అందం తనకే ఇలా కిర్రెక్కిస్తోంటే, చూపరులకు ఎలా ఉంటుందో ఊహించుకోగలననీ అంటోంది. అమ్మాయిలు అసూయ చెందే అందం, అబ్బాయిలకు నిదురలేకుండా చేసే చందం సొంతం చేసుకున్న సమంతా హూప్స్ మరి బిగ్ స్క్రీన్ పైనే ఇలా నటించి ఉంటే ఎలా ఉండేదంటారు!?

Exit mobile version