Site icon NTV Telugu

Samantha: మీరు నన్ను ఎప్పటికీ వదలరు

Sam

Sam

Samantha: సమంత తన ఫిట్ నెస్ మీద ఎంత శ్రద్ధ చూపుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం జిమ్ లో అధిక బరువులు మోసే హీరోయిన్స్ లో సామ్ ఒకరు. ఇక గత కొన్నిరోజుల నుంచి ఆమె మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామ్ యశోద ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు వచ్చింది. ఇక నిన్న శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ ను అందుకొని కలక్షన్ల దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రేక్షకులకు థాంక్స్ చెప్పింది. అంతేకాకుండా ఎప్పుడు తన జిమ్ కోచ్ జిలేబి ఇవ్వలేదని, యశోద సక్సెస్ అందుకోవడంతో తనకు జిలేబి ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది. అయితే సామ్ నేటి నుంచి జిమ్ లో మళ్లీ కసరత్తులు మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది.

చేతికి సెలైన్ వైర్ ఉన్నా కూడా జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను పోస్ట్ చేసి.. ఇక మొదలు అన్నట్లు తెలిపింది.” గత కొన్ని నెలలుగా వీటన్నింటిని చూసిన కొద్ది మంది వ్యక్తులలో మీరు కూడా ఉన్నారు… బలహీనత ద్వారా, కన్నీళ్ల ద్వారా, అధిక మోతాదు స్టెరాయిడ్ థెరపీల ద్వారా.. అన్నింటి ద్వారా ఇలా ఉన్నాను. మీరు నన్ను వదులుకోనివ్వలేదు.. మరియు మీరు నన్ను ఎప్పటికీ వదులుకోనివ్వరని నాకు తెలుసు.. థాంక్యూ” అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆరోగ్యం బాగోనప్పుడు ఈ జిమ్ అవసరమా..? అది కూడా ఒక చేత్తో బరువులు మోయడం ఎందుకు.. కొన్నిరోజులు రెస్ట్ తీసుకోవచ్చుగా అంటూ సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. సామ్ ను చూస్తుంటే కొద్దిగా కోలుకున్నట్లు కనిపిస్తోంది. ఇంకొన్ని రోజుల్లో పూర్తిగా కోలుకొని మళ్లీ బౌన్స్ బ్యాక్ అంటూ షూటింగ్ లో అడుగుపెట్టనున్నదని సమాచారం.

Exit mobile version