Samantha : చూస్తుంటే సమంత టాలీవుడ్ ను వదిలేసి వెళ్లిపోయేలా కనిపిస్తోంది. ఇకపై ఆమె టాలీవుడ్ సినిమాల్లో కనిపించడం కష్టమే అంటున్నారు. చివరగా ఆమె విజయ్ దేవరకొండతో నటించిన ఖుషి సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ ఇంకో సినిమా చేయలేదు. ఖుషి మూవీకి ముందు రెండేళ్ల గ్యాప్ తీసుకుంది. అంటే మూడేళ్లలో ఆమె రెండు సినిమాల్లో మాత్రమే మెరిసింది. నిర్మాతగా రీసెంట్ గా శుభం సినిమాను నిర్మించింది. అది పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ దాని తర్వాత మరో సినిమా ప్రకటించలేదు.
Read Also : Deepika Padukone : దీపిక నాతో రెండేళ్లు డేటింగ్ చేసింది.. నటుడి షాకింగ్ కామెంట్స్..
ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ బాలీవుడ్ హీరోలను ప్రిఫర్ చేస్తున్నారు. కొత్త హీరోయిన్లు పుట్టుకొస్తున్నారు. సమంతతో స్టార్ హీరోలు ఒక్కొక్కరు రెండు, మూడు సినిమాలు చేసి ఉన్నారు. కాబట్టి మళ్లీ సమంతను తీసుకునే అవకాశం లేదు. పైగా సమంత విడాకుల తర్వాత స్టార్ హీరోలు సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. సాధారణంగా హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే వారికి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు తగ్గిపోతాయి. అది ఎవరైనా సరే. ఇప్పుడు సమంత పరిస్థితి కూడా అదే.
స్టార్ హీరోయిన్ గా అగ్ర హీరోలతో సినిమాలు చేసిన చరిత్ర సమంతది. అలాంటి ఆమె.. ఇప్పుడు యావరేజ్ హీరోల సినిమాల్లో నటించే పరిస్థితి లేదు. దానికన్నా నటించకుండా ఉండిపోవడమే బెటర్ అని ఆలోచిస్తోందంట. అవసరం అయితే లేడీ ఓరియెండెట్ సినిమాలు చేసుకుంటే బెటర్ అని ట్రై చేస్తోందంట. కాకపోతే తమిళ డైరెక్టర్ల సినిమాల్లోనే ఆమె ట్రై చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
Read Also : RGV : అమితాబ్ వల్లే చిరంజీవి, రజినీకి స్టార్ ఇమేజ్.. ఆర్జీవీ సంచలనం..
