Site icon NTV Telugu

Samantha Hanuman Review: ‘హనుమాన్’ మూవీకి సమంత రివ్యూ

Samantha (3)

Samantha (3)

Samantha Gives Hanuman Movie Review: తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘హనుమాన్’ సినిమాకి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమా చూసిన అందరూ తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కేవలం హనుమాన్ సినిమా చూసిన ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. నిన్న రాత్రి తన స్నేహితుడు రాహుల్ రవీంద్రన్‌తో కలిసి ఏఎంబీలో ‘హనుమాన్’ చూసిన సమంత తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. ఈ క్రమంలో ఆమె తన రివ్యూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. మనలో చిన్ని పిల్లల మనస్తత్వాన్ని బయటకు తీసుకొచ్చే సినిమా గొప్ప సినిమా అని నేను నమ్ముతా, ఎగ్జైటింగ్ విజువల్స్, సినిమాటిక్ హై, హ్యూమర్, మ్యాజిక్ తో పాటు అద్భుతమైన మ్యూజిక్, విజువల్స్, పర్ఫార్మెన్స్‌లు అన్ని ఒకే దగ్గర చేరి ఒక అద్భుతాన్ని చేశాయి.

Guntur Kaaram Collections: ఫేక్ కలెక్షన్స్ ఆరోపణలు.. ఛాలెంజ్ చేసిన నాగవంశీ

హనుమాన్‌ను పెద్ద స్క్రీన్‌‌పై చూడడం మరింత అద్భుతంగా ఉంది. థాంక్యూ ప్రశాంత్ వర్మ, నీ యూనివర్స్‌లోని తరువాత చాప్టర్లను చూడడానికి నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. తేజ నువ్వు నన్ను సర్‌ప్రైజ్ చేశావు. నీ కామెడీ టైమింగ్, నీ అమాయకత్వం, హనుమంతుగా నీ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ సినిమాకు ప్రాణం పోశాయి. సినిమా కాస్ట్ మొత్తానికి కంగ్రాట్స్’ అంటూ ‘హనుమాన్’పై తన రివ్యూ చెప్పేసింది. మొన్నటి సంక్రాంతికి తెలుగు నుంచి మొత్తం నాలుగు సినిమాలు విడుదల కాగా.. ‘హనుమాన్’కి ఉన్న క్రేజ్ ను మరే సినిమా మ్యాచ్ చేయలేకపోతోంది. కేవలం ఇండియాలోనే కాదు ఓవర్సీస్‌లో కూడా ‘హనుమాన్’ జోరు కొనసాగుతోంది. విడుదలయ్యి వారం రోజులు అయినా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ మూవీ టికెట్స్ కోసం ఎగబడుతున్నారు అక్కడి మన సినీ ప్రియులు.

Exit mobile version