లేడీ సూపర్ స్టార్ సమంతా గత కొంతకాలంగా ‘మయోసైటిస్’తో బాధతున్న సంగతి తెలిసిందే. ట్రీట్మెంట్ తీసుకుంటూ పబ్లిక్ అప్పీరెన్స్ ని పూర్తిగా అవాయిడ్ చేసిన సామ్, దాదాపు ఆరు నెలల తర్వాత అభిమానుల ముందుకి వచ్చింది. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన పాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’ ట్రైలర్ ని ఒక ఈవెంట్ ని చేసి గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సమంతా కనిపించింది. వైట్ సారీలో సామ్ ని చూసిన అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చిత్ర యూనిట్ పాల్గొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సమంతా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే సమంతాలో గ్లో పోయింది అంటూ ఒక సోషల్ మీడియా పేజ్ ఒక పోస్ట్ చేసింది. విడాకుల నుంచి బయటకి వచ్చి, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది అనుకున్న సమంతాని అనారోగ్యం గట్టి దెబ్బ తీసింది అంటూ ఆ పేజ్ పోస్ట్ చేసింది. ఈ కామెంట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అటు తిరిగి ఇటు తిరిగి ఈ కామెంట్ సమంతా వరకూ వెళ్లింది.
ఈ నెగటివ్ కామెంట్ పై స్పందించిన సమంతా… “I pray you never have to go through months of treatment and medication like I did .. And here’s some love from me to add to your glow” అంటూ స్వీట్ గానే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. సమంతా రియాక్షన్ చూసిన ఫాన్స్ “స్టే స్ట్రాంగ్ సామ్” అంటూ అండగా నిలుస్తున్నారు. ఇదే సమయంలో ఒక బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ కూడా సమంతాకి అండగా నిలిచాడు. “U don’t feel bad abt anything u just care about clickbait feel bad for u son. Also glow is avaliable in instagram filters. Just meet Sam trust me she was glowing.” అంటూ వరుణ్ ధావన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. సమంతగా సపోర్ట్ గా వరుణ్ ధావన్ ట్వీట్ చెయ్యడంతో, అతని యాటిట్యూడ్ అందరూ అభినందిస్తున్నారు. ఇదిలా ఉంటే సమంతా, వరుణ్ ధావన్ లు కలిసి అమెజాన్ ప్రైమ్ కోసం ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. ‘రుస్సో బ్రదర్స్’ ప్రొడ్యూస్ చేస్తూ, షో రన్నర్స్ గా వ్యవహరిస్తున్న ‘సీటాడెల్’ అనే ఫ్రాంచైజ్ లో భాగంగా ఈ సీరీస్ ని రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి ఈ స్పై థ్రిల్లర్ రెగ్యులర్ షూటింగ్ లో సమంతా జాయిన్ అయ్యే అవకాశం ఉంది.
https://twitter.com/Samanthaprabhu2/status/1612469940556267522
U don’t feel bad abt anything u just care about clickbait feel bad for u son. Also glow is avaliable in instagram filters. Jsut meet Sam trust me she was glowing . 🙏 https://t.co/JRslCKYJpP
— Varun sunny sanskari Dhawan (@Varun_dvn) January 10, 2023
