NTV Telugu Site icon

Samantha: సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ఆ పని చేస్తున్న సామ్ ..

Sam

Sam

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఒక ఏడాది పాటు ఆమె సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. చికిత్స కోసం అమెరికా వెళ్తోందని వార్తలు వచ్చాయి. అవును.. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న ఆమె.. చికిత్స కోసమే ఈ బ్రేక్ తీసుకోనున్నదని చెప్పుకొచ్చారు. సినిమాలకు బ్రేక్ తీసుకున్నది ఖచ్చితంగా చికిత్స కోసమే.. కానీ, అది నేచర్ మాత్రమే అందించే చికిత్స అని తెలుస్తోంది. ప్రస్తుతం సామ్.. వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ మధ్యనే కోయంబత్తూర్ లోని ఇషా ఫౌండేషన్ కు వెళ్లి ఆధ్యాత్మిక లోకంలో గడిపిన ఆమె తాజాగా మాల్దీవుల్లో ప్రత్యేక్షమయ్యింది. ఉదయం లేచిన వెంటనే ఇలా ఉంది అంటూ ఆమె కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

వైట్ కలర్ మినీ డ్రెస్ లో క్యాప్ పెట్టుకొని వెనుక నుంచి.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కనిపించింది సామ్. ఇక ప్రకృతిని మించిన వైద్యుడు ఎవరు లేరు అని పెద్దవారు చెప్తారు. అలానే సామ్ సైతం .. ఇలా ప్రకృతితో మమేకం అయ్యి మళ్లీ నార్మల్ స్థితికి రావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ట్రిప్ లో సామ్ తో పాటు ఆమె స్నేహితురాలు అనూష స్వామి కూడా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం సామ్ పూర్తి చేసిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. తెలుగులో ఖుషీ , హిందీలో సిటాడెల్. షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ రెండు సినిమా ప్రమోషన్స్ లో సామ్ సందడి చేస్తుందా.. ? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక సామ్ ఫోటోలు చూసిన అభిమానులు.. త్వరగా కోలుకో సామ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Show comments