Site icon NTV Telugu

Rihanna’s Bold Maternity Photo Shoot : ఇంటర్నేషనల్ సింగర్ పై సామ్ కామెంట్

Samantha

టాలీవుడ్ బ్యూటీ సమంత ఇంటర్నేషనల్ సింగర్ రిహన్నాను అభినందించారు. తల్లి కాబోతున్న రిహన్నా వోగ్ కోసం చేసిన తాజా ఫోటోషూట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన ఓ ఫోటోను సామ్ తన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ “లెజెండరీ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ ఫోటోలలో రిహన్నా బ్రౌన్ కలర్ జాకెట్, స్కర్ట్ ధరించి కన్పిస్తోంది. త్వరలోనే తమ మొదటి బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్న సెలెబ్రిటీ కపుల్ రిహన్నాకు, ఆమె బాయ్‌ఫ్రెండ్, రాపర్ ASAP Rockyకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read Also : Beast : విజయ్ కు ఫ్యాన్స్ కు షాక్… అక్కడ నో రిలీజ్ !

ఇదిలా ఉండగా, సమంత ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉంది. సామ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం “యశోద” ఆగస్టు 12న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దర్శక ద్వయం హరి శంకర్ అండ్ హరీష్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో కూడా విడుదల కానుంది. ఇందులో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. మరోవైపు విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి సామ్ నటించిన తమిళ చిత్రం “కాతువాకుల రెండు కాదల్” చిత్రాన్ని ఇటీవలే పూర్తి చేసింది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ డ్రామా ఏప్రిల్ 28న దేశవ్యాప్తంగా విడుదల కానుంది.

Exit mobile version