Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. టాలీవుడ్ లోనే కాకుండా సామ్ బాలీవుడ్ లో పాగా వేయడానికి చాలానే కస్టపడుతోంది. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ హిట్ తో ఒక్కసారిగా హిందీలో కూడా పాపులర్ అయిన సామ్ ఈ సిరీస్ తర్వాత వరుస అవకాశాలను అందుకొంటూ వస్తోంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా బాలీవుడ్ షోస్, బాలీవుడ్ పార్టీలలోనే దర్శనమిస్తున్న బ్యూటీ త్వరలోనే ముంబైకు మకాం మార్చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అయి నేపథ్యంలోనే బాలీవుడ్ ఫేమస్ టాక్ షో కాఫీ విత్ కరణ్ షో కు గెస్ట్ గా వెళ్లిన సామ్.. అక్షయ్ కుమార్, కరణ్ జోహార్ తో రచ్చ చేసింది. అయితే ఈ షోలో అమ్మడు బాలీవుడ్ హీరో గురించి చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ హీరోయిన్లు సైతం టాలీవుడ్ హీరోలు అంటే ఇష్టం.. వారితో డేటింగ్ చేయాలని ఉంది అని చెప్తుంటే.. టాలీవుడ్ హీరోయిన్ అయినా సామ్ మాత్రం బాలీవుడ్ హీరోతో డాన్స్ చేస్తా అని చెప్పడం విశేషం. ఈ తాజా ఎపిసోడ్ ప్రోమో లో కరణ్, సామ్ ను ఒక ప్రశ్న అడిగాడు. మీ బెస్ట్ ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీలో మీరు డాన్స్ చేయాల్సి వస్తే ఏ ఇద్దరు బాలీవుడ్ హీరోలతో చేస్తారు అంది అడుగగా.. టక్కున సామ్, రణవీర్ సింగ్, రణవీర్ సింగ్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ సమాధానాన్ని ఊహించలేని అక్షయ్ కొద్దిగా అసహనంగా ఓ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అయితే బాలీవుడ్ లో పెళ్లికాని హీరోలు అంత మంది ఉండగా ఇద్దరు పేర్లు రణవీర్ సింగ్ అని చెప్పడంతో అతడిపై సామ్ మనసు పారేసుకుందేమో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే ఈ ఎపిసోడ్ కోసం అక్కినేని అభిమానులు, సామ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చైతూ విడాకుల గురించి ఏమైనా మాట్లాడుతుందా..? కరణ్ ఆమెతో ఏమైనా నిజాలు చెప్పిస్తాడా..? అనేది చూడాలి.
