Site icon NTV Telugu

Samantha : అల్లు అర్జున్-అట్లీ మూవీలో నటించట్లేదు..

Samantha

Samantha

Samantha : స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ వరుసగా మీడియా ముందుకు వస్తోంది. ఆమె నిర్మాతగా మారి తీస్తున్న మూవీ శుభం. తన సొంత బ్యానర్ అయిన ట్రా లా లా మీద చేస్తున్న ఈ మూవీని సమంత వరుసగా ప్రమోట్ చేస్తుంది. వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్ లు నిర్వహిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అనేక విషయాలపై స్పందించింది. కొన్ని రోజులుగా వినిపిస్తున్న గాసిప్ మీద కూడా స్పందించింది. అల్లు అర్జున్-అట్లీ సినిమాలో తాను నటించట్లేదని క్లారిటీ ఇచ్చింది. అట్లీ, అల్లు అర్జున్ తనకు క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చింది. అట్లీతో త్వరలోనే ఓ సినిమా చేస్తానని మాత్రం చెప్పుకొచ్చింది.

Read Also : Hari Hara Veera Mallu : ఐదేళ్ల సుదీర్ఘ ప్రయాణం.. ఎన్నో కుదుపులు, మలుపులు!
అట్లీ డైరెక్షన్ లో వచ్చిన అదిరింది, పోలీసోడు సినిమాల్లో ఆమె నటించింది. అందుకే అతనితో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ‘నాకు నిర్మాతగా మారిన తర్వాతనే ఒక నిర్మాత కష్టాలు ఏంటి అనేది అర్థం అవుతోంది. ఇప్పుడు చాలా ఓపిక పెరిగింది. ఒక్కో సీన్ ను అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నాను. ఈ మూవీలో నేను ఓ కామియో రోల్ చేశాను. వేరే వారిని అడగాలని అనిపించలేదు. అందుకే స్వయంగా నేనే చేశాను. ఈ మూవీని ఇంకో మూడు రోజులు ప్రమోట్ చేస్తాను. ఆ తర్వాత ప్రేక్షకులే దీన్ని ముందుకు తీసుకెళ్తారు’ అంటూ చెప్పుకొచ్చింది సమంత. శుభం మూవీ మే 9న థియేటర్లలోకి రాబోతోంది.
Read Also : Pawankalyan : వీరమల్లుకు కొత్త చిక్కులు.. వాళ్లతో పోటీ తప్పదా..?

Exit mobile version