NTV Telugu Site icon

Citadel Teaser: సిటాడెల్ టీజర్ రిలీజ్.. యాక్షన్ అదరగొట్టిన సమంత

Maxresdefault

Maxresdefault

Samantha Citadel Teaser: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. మయోసైటిస్ వ్యాధి బారి నుంచి ఈ మధ్యనే కోలుకున్న సామ్.. పెండింగ్ ఉన్న తన సినిమాలను కంప్లీట్ చేస్తోంది. ప్రస్తుతం సమంత నటిస్తున్న చిత్రాల్లో “సిటాడెల్” ఒకటి. అమెజాన్ ప్రతిష్టాత్మకంగా ఈ సిరీస్ ను నిర్మిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో పేరు తెచ్చుకున్న రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి సామ్ ఈ సిరీస్ లో కనిపించనుంది.. హాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక చోప్రా చేసిన పాత్రను ఇక్కడ సమంత చేస్తోంది. ఇక ఈ చిత్రం కోసం సామ్ ఎన్నో రిస్క్ లు కూడా చేసింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌కు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సిరీస్ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా టీజర్ కూడా రిలీజ్ చేసారు మేకర్స్.

Also Read:Shivam Bhaje Review: శివం భజే రివ్యూ

టీజర్ లో సామ్ యాక్షన్ సీన్స్ తో అదరకొట్టింది. గన్ పట్టుకొని పోరాడే షాట్స్ అయితే అదిరిపోయాయి. మరి ముఖ్యంగా వరుణ్‌, సామ్‌ కలిసి చేసే యాక్షన్‌ సన్నివేశాలు టీజర్ లో ప్రత్యేకం అనే చెప్పాలి. 1990ల నేపథ్యంలో ఈ సిరీస్‌ సాగుతోందని తెలుస్తోంది. ఇక ఈ సిరీస్ లో ఎలాంటి డూప్‌ లేకుండా ఆమె స్వయంగా యాక్షన్‌ సీక్వెన్స్‌ను పూర్తి చేశారట. రుస్సో బ్రదర్స్‌ నిర్మిస్తున్న ఈ సిరీస్‌ పలు దేశాల్లో, వివిధ భాషల్లో రూపొందుతోంది. అలానే ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ తేదీని కూడా ప్రకటించారు. నవంబరు 7వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. హిందీతో పాటు, భారతీయ భాషల్లోనూ ఈ సిరీస్‌ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. మరి సిరీస్ ఎలా ఉంటుంది అనేది రిలీజ్ తరువాత చూడాల్సిందే.

Show comments