Citadel Teaser: సిటాడెల్ టీజర్ రిలీజ్.. యాక్షన్ అదరగొట్టిన సమంత
- యాక్షన్ అదరగొట్టిన సమంత వరుణ్ తో కలిసి చేసే యాక్షన్ సన్నివేశాలు టీజర్ లో ప్రత్యేకం
- ఎలాంటి డూప్ లేకుండా ఆమె స్వయంగా యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేశారట
- ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని కూడా ప్రకటించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha Citadel Teaser: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. మయోసైటిస్ వ్యాధి బారి నుంచి ఈ మధ్యనే కోలుకున్న సామ్.. పెండింగ్ ఉన్న తన సినిమాలను కంప్లీట్ చేస్తోంది. ప్రస్తుతం సమంత నటిస్తున్న చిత్రాల్లో “సిటాడెల్” ఒకటి. అమెజాన్ ప్రతిష్టాత్మకంగా ఈ సిరీస్ ను నిర్మిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో పేరు తెచ్చుకున్న రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి సామ్ ఈ సిరీస్ లో కనిపించనుంది.. హాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక చోప్రా చేసిన పాత్రను ఇక్కడ సమంత చేస్తోంది. ఇక ఈ చిత్రం కోసం సామ్ ఎన్నో రిస్క్ లు కూడా చేసింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సిరీస్ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా టీజర్ కూడా రిలీజ్ చేసారు మేకర్స్.
Also Read:Shivam Bhaje Review: శివం భజే రివ్యూ
Also Read
- buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
- chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్‌తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్‌పై మెగాస్టార్ రియాక్షన్‌ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
- Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్‌లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
- 'Peddi': టాలీవుడ్ అంటే అంత అలుసా? 'పెద్ది' విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
టీజర్ లో సామ్ యాక్షన్ సీన్స్ తో అదరకొట్టింది. గన్ పట్టుకొని పోరాడే షాట్స్ అయితే అదిరిపోయాయి. మరి ముఖ్యంగా వరుణ్, సామ్ కలిసి చేసే యాక్షన్ సన్నివేశాలు టీజర్ లో ప్రత్యేకం అనే చెప్పాలి. 1990ల నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతోందని తెలుస్తోంది. ఇక ఈ సిరీస్ లో ఎలాంటి డూప్ లేకుండా ఆమె స్వయంగా యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేశారట. రుస్సో బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ సిరీస్ పలు దేశాల్లో, వివిధ భాషల్లో రూపొందుతోంది. అలానే ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని కూడా ప్రకటించారు. నవంబరు 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు, భారతీయ భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. మరి సిరీస్ ఎలా ఉంటుంది అనేది రిలీజ్ తరువాత చూడాల్సిందే.
తాజావార్తలు
-
Vastu Tips: బెడ్రూమ్లో అద్దం ఏ దిశలో ఉంటే మంచిది? చాలామంది చేసే ఈ పొరపాటు మీ ఇంట్లో కూడా ఉందా?
-
Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!