సమంతా నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ శాకుంతలం సినిమా ప్రమోషన్స్ కి పీక్ స్టేజ్ లో చేస్తుంది. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ ఇస్తూ సమంతా శాకుంతలం సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తుంది. ఇటివలే తెలుగు ఆడియన్స్ కోసం సుమకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంతా మాట్లాడుతూ శాకుంతలం సినిమా ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లు చెప్పింది.
“గుణశేఖర్ ముందు నాకు శాకుంతలం సినిమా గురించి చెప్పగానే భయం వేసి నో చెప్పేసాను. ఎందుకంటే అప్పుడు నేను వేరే మూడ్ లో ఉన్నాను. అప్పుడే ది ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ చేశాను, అందులో యాక్షన్ ఎపిసోడ్స్ తో వేరేలా ఉన్నాను. సడన్ గా శాకుంతలం పాత్ర అంటే భయమేసింది. అయితే ఒకప్పుడు ఏదైనా విషయం నన్ను భయపెడితే దాని స్కిప్ చేసే దాన్ని, ప్రస్తుతం మాత్రం ఏ విషయం భయపెట్టినా ముందు దాన్ని చేసేస్తున్నాను. అదే నన్ను శాకుంతలం సినిమా చేసేలా చేసింది. ఆ తెగింపే నన్ను మూడు సంవత్సరాలుగా ముందుకి నడిపిస్తుంది. శాకుంతలం సినిమాకి ఓకే చెప్పిన తర్వాత గుణశేఖర్ కాస్ట్యూమ్ టెస్ట్ కి పిలిచారు, వెళ్లి గెటప్ లో రెడీ అయితే నాకు నేనే ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. సాఫ్ట్ గా కాకుండా రాజీ కోసం ఫిట్ గా మజిల్స్ తో ఉన్నాను. అప్పుడు దుష్యంతుడు నన్ను మర్చిపోయాను అంటే కత్తి తీసుకోని చంపేసే అంత ఫిట్ గా ఉన్నాను. ఆ లుక్ లో ఉంటే శకుంతలగా చెయ్యలేనని అర్ధం అయ్యి నా డైట్ ని మార్చాను, వర్కవుట్స్ ఆపేసాను, సాఫ్ట్ గా కనిపించడానికి పూర్తిగా ఫిట్నెస్ నుంచి దూరం వచ్చాను. అప్పుడు శకుంతల లుక్ వచ్చింది. నడక దగ్గర నుంచి ప్రతి విషయంలో ఎన్నో జాగ్రత్త తీసుకోని శాకుంతలం సినిమా చేశాను. ఇది మనకి ఇండియన్ డిస్నీ క్యారెక్టర్ లాంటి ఫాంటసీ పాత్ర, అందుకే అంత ఇష్టంగా చేశాను. షూటింగ్ సమయంలో పడిన కష్టం ఇప్పుడు చూసుకుంటే మంచి ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమా కోసం పతి ఒక్కరూ 100% ఎఫోర్ట్స్ పెట్టారు. అది మీకు ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది” అని సమంతా చెప్పుకొచ్చింది.
ది ఫ్యామిలీ మాన్ 2 సీరీస్ లో సమంతా ‘రాజీ’ పాత్రలో నటించింది. నెగటివ్ టచ్ ఉన్న ఈ పాత్రలో సామ్ అద్భుతంగా నటించింది. రాజీ పాత్రకి శకుంతలా దేవి పాత్రకి చాలా వేరియేషన్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ని సమంతా చాలా బాగా హ్యాండిల్ చేస్తూ కంప్లీట్ మేకోవర్ లో కనిపించింది. మరి సామ్ పడిన కష్టానికి శాకుంతలం సినిమా ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి.
