Site icon NTV Telugu

Salman Khan: ప్రమోషన్స్ మొదలుపెట్టిన భాయ్ జాన్…

Salman

Salman

బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నాలుగేళ్ల తర్వాత నటిస్తున్న మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’. కాటమరాయుడు సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా వెంకటేష్, భూమిక, జగపతి బాబు స్పెషల్ రోల్స్ ప్లే చేస్తున్నారు. టీజర్, సాంగ్స్ తో ఎక్స్పెక్టేషన్స్ మేకర్స్ ట్రైలర్ లాంచ్ కి రెడీ అయ్యారు. ఏప్రిల్ 10న KKBKKJ ట్రైలర్ ని లాంచ్ చేస్తున్నట్లు సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత సల్మాన్ ఖాన్ రంజాన్ రోజున తన సినిమాని రిలీజ్ చేస్తుండడంతో సల్మాన్ ఖాన్ ఫాన్స్ అంతా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. హిట్ గ్యారెంటీ అనేలా సినిమాని ప్రమోట్ చేస్తున్న సల్మాన్, కంప్లీట్ కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. ఫర్హాద్ సమ్జీ KKBKKJ సినిమాని హిందీ నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసాడని బీటౌన్ మీడియా చెప్తోంది. మరి సల్మాన్ ఈ సినిమా ఈద్ కి సూపర్ హిట్ అందుకుంటాడా? రామ్ చరణ్ క్యామియో బాక్సాఫీస్ దగ్గర KKBKKJ కి హెల్ప్ అవుతుందా? అనే ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా రిలీజ్ అయ్యే వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.

Read Also: Tamannaah: హాట్ నెస్ ఓవర్ లోడెడ్…

Exit mobile version