Site icon NTV Telugu

Salman Khan: భారీ భద్రతతో దుబాయ్ వెళ్లిన సల్మాన్ ఖాన్.. ఎందుకంటే?

Salman Khan Dubai

Salman Khan Dubai

Salman Khan Spotted At The Mumbai Airport Jets Off To Dubai: ఏప్రిల్ 14న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పుల ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పటి నుండి సల్మాన్ ఖాన్ భద్రతను కట్టుదిట్టం చేశారు. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సల్మాన్ ఖాన్‌ను కలిసేందుకు వచ్చారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కట్టుదిట్టమైన భద్రత మధ్య శుక్రవారం ఉదయం ముంబై నుండి బయలుదేరారు. సల్మాన్ ఖాన్ తన ఫిట్‌నెస్ బ్రాండ్ బీయింగ్ స్ట్రాంగ్ లాంచ్ కోసం దుబాయ్ వెళ్తున్నారు. ముంబై విమానాశ్రయంలో సల్మాన్ కనిపించగా అతని బాడీగార్డ్ షేరా కూడా ఉన్నాడు. అదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం అందించిన Y+ భద్రత కూడా కనిపించింది. భద్రతా సిబ్బంది చుట్టుముట్టడంతో సల్మాన్ ఖాన్ తన కారు దిగి ఎలాంటి పోజులు ఇవ్వకుండా విమానాశ్రయం లోపలికి వెళ్లడం కనిపించింది. సల్మాన్ తన ఫిట్‌నెస్ బ్రాండ్ బీయింగ్ స్ట్రాంగ్ లాంచ్ కోసం దుబాయ్ వెళ్లినట్లు సమాచారం.

Mansoor Ali Khan: హాస్పిటల్ నుంచి వచ్చి పోలింగ్‌ బూత్‌లో మన్సూర్‌ అలీఖాన్‌ హల్చల్!

ఆదివారం తెల్లవారుజామున, బాంద్రాలోని సల్మాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల ఇద్దరు బైక్ రైడింగ్ షూటర్లు అనేక రౌండ్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే, ఆ తర్వాత పెద్ద ఎత్తున పోలీసు ఆపరేషన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 14న నిందితులు ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు, అందులో ఒకటి గోడకు, మరొకటి సల్మాన్ ఖాన్ ఇంటి గ్యాలరీలో పడింది. ఈ ఘటనపై విచారణ జరుపుతుండగా, కాల్పులకు బాధ్యత వహిస్తూ ఫేస్‌బుక్ పోస్ట్ కూడా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ పోస్ట్‌ను జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్ అప్‌లోడ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడి కారణంగా తన ప్రణాళికలను మార్చవద్దని లేదా రీషెడ్యూల్ చేయవద్దని సల్మాన్ ఖాన్ తన బృందాన్ని కోరినట్లు చెబుతున్నారు. అందుకే ముందుగా అనుకున్న విధంగా తన షూటింగ్ మరియు ఇతర పనులను కొనసాగించాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

Exit mobile version