Salman Khan : బిగ్ బాస్ షోకు మనదేశంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మరిముఖ్యంగా హిందీ బిగ్ బాస్ ప్రోగ్రాం కు కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు. నార్త్ స్టేట్స్ లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో హిందీ బిగ్ బాస్ ను ఫాలో అవుతుంటారు. హిందీ బిగ్ బాస్ కు పోస్టుగా చేస్తున్న సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ పై ఇప్పటికే రకరకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆయనకు ఒక్కో సీజన్ కు 150 కోట్లు అని 200 కోట్లు అని బాలీవుడ్ మీడియాలో ఎప్పటి నుంచో కథనాలు వస్తున్నాయి. వీటిపై తాజాగా ఆ రియాల్టీ షో ప్రొడ్యూసర్ రిషి నెగి క్లారిటీ ఇచ్చారు.
Read Also : Bigg Boss 9 : దమ్ము శ్రీజకు దువ్వాడ శ్రీనివాస్ వార్నింగ్.. మొత్తం తెలుసంటూ..
సల్మాన్ ఖాన్ పారితోషకం పై వస్తున్న వార్తల్లో కొంత నిజం ఉండొచ్చు. రెమ్యూనరేషన్ ఎంత అనేది నేను బయట పెట్టను. ఎందుకంటే జియో ఓటిటి హాట్ స్టార్ సంస్థల మధ్య ఓ అగ్రిమెంట్ ఉంది. దాన్ని నేను బ్రేక్ చేయలేను. రెమ్యూనరేషన్ ఎంత అయినా సరే దానికి సల్మాన్ ఖాన్ అర్హుడు. ఆయన వల్లే బిగ్ బాస్ షోకు ఈ స్థాయిలో క్రేజ్ వస్తుంది. కాబట్టి ఆయనకు ఎంత ఇచ్చిన తక్కువే అంటూ చెప్పుకొచ్చాడు నిర్మాత రిషి. ఆయన మాటలను బట్టి నిజంగానే సల్మాన్ ఖాన్ కు 200 కోట్లు ఇస్తున్నారని తేలిపోయింది. ఒకవేళ నిజం కాకపోతే అవన్నీ వట్టి రూమర్స్ అని కొట్టి పారేసేవాడు కదా. హిందీ బిగ్ బాస్ నుంచి ఆ స్థాయిలో లాభాలు వస్తున్నాయి కాబట్టే సల్మాన్ ఖాన్ కు ఇంతటి భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాకపోతే ఒక బిగ్ బాస్ షో కోసం మరీ అంత ఇవ్వడం ఏంటని నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Read Also : Baahubali The Epic : కొత్త సీన్స్ యాడ్ చేయడంపై నిర్మాత క్లారిటీ
