Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan: స్టార్ హీరోల జీవితాలు బయటకు కనిపించేంత విలాసవంతంగా మాత్రమే ఉండవు. కొన్నిసార్లు వారు ఎదుర్కొన్న చేదు అనుభవాలు కూడా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజాగా అలాంటి ఓ అనుభవాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. జైలులో గడిపిన రోజుల గురించి ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఒకే బాత్రూమ్ను 50 నుంచి 70 మంది ఖైదీలు ఉపయోగించాల్సి వచ్చేదని ఆయన వెల్లడించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
రితేష్ దేశ్‌ముఖ్, ఫరా ఖాన్ హోస్ట్‌లుగా హిందీ రియాలిటీ షో ‘లాక్ అప్’లో పాల్గొన్న సందర్భంగా సల్మాన్ ఖాన్ తన జైలు జీవితానికి సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు. 1998లో కృష్ణజింకల వేట కేసు, 2002 లో హిట్ అండ్ రన్ కేసులో ఆయన కొద్ది రోజులు జైలులో గడపాల్సివచ్చింది. రియాలిటీ షోలో జైలులోని రోజులను గుర్తు చేసుకుంటూ తన మనసులోని మాటలను పంచుకున్నారు సల్మాన్ ఖాన్. అక్కడ మొదట కాస్త కఠినంగానే అనిపించినా, అక్కడి పరిస్థితులకు తాను త్వరగానే అలవాటు పడ్డానని చెప్పారు. జైలులో రోజువారీ జీవితం పూర్తిగా భిన్నంగా ఉండేదని, ప్రతి చిన్న విషయానికీ ఓపికగా ఉండాల్సివచ్చేదని ఆయన గుర్తు చేసుకున్నారు.
Also Read
- Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ 'వడ్డీ కాసుల వాడ'లో అదిరే సర్ప్రైజ్... వెంకటేశ్వర స్వామిగా జయం రవి
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
జైలులో దాదాపు 50 నుంచి 70 మంది ఖైదీలు ఒకే బాత్రూమ్ను ఉపయోగించాల్సి వచ్చేదని సల్మాన్ తెలిపారు. అంతేకాకుండా పప్పు, సాదాసీదా భోజనంతోనే రోజులు గడిపేవాడినని చెప్పారు. బయట ఉన్న సౌకర్యాలతో పోలిస్తే అక్కడి జీవితం పూర్తిగా భిన్నమైనదైనా, క్రమంగా అక్కడి వాతావరణానికి అలవాటు పడిపోయానని ఆయన వివరించారు. ఆ పరిస్థితులకు అలవాటు పడిన తర్వాత జైలు జీవితం అంత కష్టంగా అనిపించలేదని సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అక్కడ ఇంకొంత కాలం ఉండాల్సివచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండగలిగేవాడినని సరదాగా చెప్పారు. జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను అంగీకరించి వాటికి తగ్గట్టుగా మారడం ఎంత ముఖ్యమో ఆ అనుభవం తనకు నేర్పిందని వెల్లడించారు.
ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా పలు సందర్భాల్లో సల్మాన్ ఖాన్ తన జైలు అనుభవాల గురించి మాట్లాడారు. ఆ రోజులు తనలో సహనం పెంచాయని, మన నియంత్రణలో లేని పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో అర్థమయ్యేలా చేశాయని ఆయన చెప్పేవారు. అందుకే ఇప్పుడు కూడా ఆ జ్ఞాపకాలను ఎలాంటి సంకోచం లేకుండా అభిమానులతో పంచుకుంటున్నారు. మరోవైపు ఆయన ప్రస్తుతం దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న సినిమాలో బిజీగా ఉన్నారు.
- Tags
- cinema
- Salman Khan
తాజావార్తలు
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు “బ్రాండెడ్ విషం” తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!