Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పేపర్ లీకేజీలు రద్దు చేసి, పారదర్శకమైన విద్యావ్యవస్థను అందించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంతగానో శాంతియుతంగా సాగుతున్న ఈ ఉద్యమం అనుకోకుండా హింసాత్మక మలుపు తిరగడంపై పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులకు, వారి కుటుంబాలకు సమాజం నుంచి పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తమవుతోంది.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ వ్యహారంపై స్పందిస్తూ ‘ పేపర్ లీక్ అనేది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే అత్యంత తీవ్రమైన అంశం. దేశంలోని యువత అంతా కలిసికట్టుగా మెరుగైన విద్యావ్యవస్థ కోసం గళం విప్పడం, వారికి తల్లిదండ్రులు సైతం అండగా నిలవడం గొప్ప పరిణామం. చదువుపై ఎంతో అంకితభావం, నిజాయితీ, భవిష్యత్తుపై స్పష్టమైన లక్ష్యంతో ఉన్న ఈ తరం యువత చూపిస్తున్న చొరవ అభినందనీయం. శాంతియుత మార్గంలో నిరసనలు తెలుపుతూ తమ హక్కుల కోసం పోరాడుతున్న ఈ ధైర్యవంతులైన విద్యార్థులే రేపటి భారతదేశానికి గర్వకారణంగా మారనున్నారు.
Also Read
- Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్‌డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
- KorianKanakaRaju : భారీ ధర పలికిన 'కొరియన్ కనకరాజ్' ఓటీటీ రైట్స్.. షాకిస్తున్న థియేట్రికల్ బిజినెస్
- Epic Movie Release Date: విజయ్ దేవరకొండ స్లాట్‌లో ఆనంద్ దేవరకొండ? ‘ఎపిక్’ విడుదలపై ఆసక్తికర ప్రచారం
- Jana Nayagan Box Office : తెలుగులో తగ్గిపోయిన ఓపెనింగ్స్.. రీమేక్ ఎఫెక్టేనా?
ఈ సమస్య కేవలం విద్యార్థులకు, విద్యావ్యవస్థకు మధ్య ఉన్నది మాత్రమే. ఈ ఉద్యమ క్రెడిట్ అంతా విద్యార్థులకే చెందుతుంది తప్ప, దీనిని ఏ రాజకీయ పార్టీలు కూడా తమ ప్రయోజనాల కోసం స్వార్థంతో వాడుకోకూడదు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి విద్యార్థుల ఆందోళనను అర్థం చేసుకోవాలి. విద్యావ్యవస్థలోని లోపాలను సరిదిద్ది, వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయడం ద్వారా ఇటు విద్యార్థులకు, అటు దేశానికి ఎంతగానో మేలు జరుగుతుంది.
ఈ క్రమంలో చదువుకు సమాజంలో అత్యంత ప్రాధాన్యత పెరగాలి. ఏటా చదువు అనేది ఒక ట్రెండ్‌గా, గర్వకారణమైన అంశంగా మారాలి. ఎంతలా అంటే, విదేశాల నుంచి కూడా విద్యార్థులు మన దేశానికి వచ్చి చదువుకునే స్థాయికి భారతదేశం ఒక అంతర్జాతీయ ‘ఎడ్యుకేషనల్ హబ్’గా రూపాంతరం చెందాలి. ఉన్నతమైన ఆశయంతో చదువుకోవాలనుకునే ప్రతీ ఒక్కరికీ సముచిత గౌరవం, సరైన అవకాశాలు దక్కాలని ఆశిద్దాం’ అని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసారు.
It was such a peaceful movement, feel so sad that it had to take a violent turn. My heart goes out to the students and their families who were hurt. Paper leak is a very serious issue, and I am glad to know n see that the kids of our country have come together for a better…
— Salman Khan (@BeingSalmanKhan) July 22, 2026
తాజావార్తలు
-
Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
-
CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
-
Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
-
Vaibhav Suryavanshi: హరారేలో వైభవ్ ట్రాక్ రికార్డు ఇదే.. జింబాబ్వేకు కూడా దబిడిదిబిడే!
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి