Site icon NTV Telugu

SVC 63: బాక్సాఫీస్ షేక్ అయ్యే ‘మెగా’ అప్‌డేట్: సల్మాన్ ఖాన్ సరసన లేడీ సూపర్ స్టార్

Sallu Nayan

Sallu Nayan

బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, ప్రొడ్యూసర్ దిల్‌రాజు కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా #SVC63లోకి ఇప్పుడు సౌత్ ఇండియన్ క్వీన్ ఎంట్రీ ఇచ్చారు. సల్మాన్ ఖాన్‌కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నయనతార, ఇప్పుడు సల్మాన్‌తో జతకట్టడం ఈ ప్రాజెక్ట్ రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది. టాలీవుడ్, బాలీవుడ్ మేళవింపుతో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు ఇండియన్ సినిమాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా నిలిచింది. నిజానికి దర్శకుడు వంశీ పైడిపల్లి తన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు, ఈ కథలో కూడా నయనతార పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా, కథను మలుపు తిప్పేలా ఉండబోతోందట.

Also Read : Peddi: పాపం పెద్ది.. మంచి మంచి డేట్లు మిస్సవుతున్నాయ్

అందుకే ఆమె కాలిబర్‌కు తగ్గ పాత్రను డిజైన్ చేసి, సల్మాన్ – నయనతార అనే క్రేజీ పేయింగ్‌ను సెట్ చేశారు. ఈ కాంబినేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ భారీ యాక్షన్ విజువల్ వండర్‌ను 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే రాబోతున్నాయని టీమ్ వెల్లడించింది.

Exit mobile version