Site icon NTV Telugu

Salman Khan: భాయ్ ‘ఈద్’ రోజున మరీ ఇంత వీక్ అయితే ఎలా?

Salman Khan

Salman Khan

హిందీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా, ఏ సీజన్ లో ఎవరి సినిమాలో రిలీజ్ కి షెడ్యూల్ అయినా, రంజాన్ ని మాత్రం సల్మాన్ ఖాన్ ని వదిలేస్తారు. ఈ సీజన్ లో భాయ్ జాన్ కి తమ సినిమాని పోటీగా రిలీజ్ చెయ్యాలి అంటే భయపడతారు. అందుకే రంజాన్ అనగానే భాయ్ జాన్ సినిమా మాత్రమే గుర్తొస్తుంది. ఎన్నో ఏళ్లుగా జరుగుతూ వస్తున్న ఈ ఆనవాయితీని పాటిస్తూ నార్త్ ఫాన్స్ అంతా ఈద్ కి భాయ్ జాన్ సినిమా కోసం వెయిట్ చేస్తారు. భాయ్ జాన్ సల్మాన్ నటించిన ఒక సినిమా రంజాన్ రోజున ఈద్ కి రిలీజ్ అవుతుంది అంటే ట్రేడ్ వర్గాలు బాక్సాఫీస్ రికార్డ్స్ ని కొత్తగా రాయడానికి రెడీ అవుతారు. 2010 నుంచి మొదలైన ఈ ట్రెండ్… దబాంగ్, బాడీ గార్డ్, ఏక్ థా టైగర్, కిక్, భజరంగి భాయ్ జాన్, సుల్తాన్, ట్యూబ్ లైట్, రేస్ 3, ‘భారత్’ సినిమా వరకూ ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ కొనసాగింది. వీటిలో హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా దాదాపు నలభై కోట్ల వరకూ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాలు ఉన్నాయి అంటే ఈద్ కి భాయ్ జాన్ బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు.

గత నాలుగేళ్ళుగా ఈద్ ని మిస్ చేస్తున్న సల్మాన్ ఖాన్, 2023లో ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చేసాడు. కాటమరాయుడు సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు మార్నింగ్ షో నుంచే నెగటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో నార్త్ సినీ అభిమానులందరూ డిజప్పాయింట్ అయ్యారు. ఓవరాల్ గా అన్ని సెంటర్స్ లో కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా మొదటి రోజు 15.81 కోట్లని మాత్రమే రాబట్టింది. ఇది సల్మాన్ కెరీర్ లోనే ఈద్ కి వచ్చిన సినిమాల్లో వీకెస్ట్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి. ఈరోజు రంజాన్ పండగ కాబట్టి కలెక్షన్స్ లో కాస్త జోష్ కనిపించే అవకాశం ఉంది. ఒకవేళ కలెక్షన్స్ లో గ్రోత్ కనిపిస్తే అదే ఒక వారం రోజుల పాటు మైంటైన్ చెయ్యగలిగితేనే కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా ఒడ్డున పడే అవకాశం ఉంది లేదంటే భాయ్ జాన్ ఖాతాలో ఫ్లాప్ పడినట్లే.

Exit mobile version