NTV Telugu Site icon

Salman Khan: పూజా హెగ్డే ప్రేమలో పడుతున్న భాయ్ జాన్

Salman Khan

Salman Khan

బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’. ఫర్హాద్ సమ్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ లవ్ యాక్షన్ మూవీ అజిత్ నటించిన ‘వీరమ్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతోంది. వీరమ్ సినిమానే పవన్ కళ్యాణ్ తెలుగులో ‘కాటమరాయుడు’ పేరుతో రీమేక్ చేశాడు. మాస్ ఎలిమెంట్స్ కావలసినన్ని ఉన్న ఈ సినిమా సల్మాన్ ఖాన్ ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందనే ఆలోచనతో మేకర్స్ ఈ రీమేక్ చేస్తున్నారు. ఈ రంజాన్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ కి రెడీ అవుతున్న ‘KKB KKJ’ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తున్న ఈ మూవీ నుంచి రెండు సాంగ్స్ వచ్చి చార్ట్ బస్టర్స్ అయ్యాయి. లేటెస్ట్ గా ‘KKB KKJ’ సినిమా నుంచి మూడో సాంగ్ ని రిలీజ్ చేస్తున్నాం అంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. అమాన్ మల్లిక్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ ‘ఫాలింగ్ ఇన్ లవ్’ సాంగ్ ని సల్మాన్ ఖాన్ స్వయంగా పాడడం విశేషం.

హీరోయిన్ ప్రేమ కోసం హీరో చేసే ఎఫోర్ట్స్ నేపధ్యంలో వచ్చే ఈ సాంగ్ టీజర్ సల్మాన్ ఫాన్స్ ని ఇంప్రెస్ చేసింది. ముఖ్యంగా లాంగ్ హెయిర్ తో, హెడ్ బ్యాండ్ కట్టి సల్మాన్ ఖాన్ కనిపించిన విజువల్ కి ఫాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఈ టీజర్ లో సల్మాన్ ఖాన్ తన మార్క్ డాన్స్ స్టెప్స్ కూడా వేశాడు. సల్మాన్ ఖాన్ పక్కన పూజా హెగ్డే కూడా బ్యూటీఫుల్ గా కనిపించింది. వెంకీ మామ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీ సల్మాన్ ఖాన్ కి హిట్ ఇస్తుందేమో చూడాలి. గత కొంతకాలంగా ఫ్లాప్స్ లో ఉన్న సల్మాన్ ఖాన్ కి ‘KKB KKJ’ హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. పైగా రంజాన్ కి రిలీజ్ అవుతుంది కాబట్టి సల్మాన్ ఖాన్ హిట్ కొట్టాలని బాలీవుడ్ ఆడియన్స్ కోరుకుంటున్నారు. మరి భాయ్ జాన్ ఏం చేస్తాడో చూడాలి.

Show comments