బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన బాలీవుడ్ లోని పలువురు ప్రముఖులతో కలిసి పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఇక భాయ్ బర్త్ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దశాబ్దాలకు పైగా ఆయన బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు. అయితే ఇటీవల కాలంలో మన దర్శక దిగ్గజం రాజమౌళి, సల్మాన్ ఖాన్ ఇద్దరూ ఎక్కువగా కలుస్తున్నారు. దీంతో వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతోంది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సల్మాన్ ముఖ్య అతిథిగా హాజరు కావడమే కాకుండా, సల్మాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ 15’ షోకి ‘ఆర్ఆర్ఆర్’ త్రయం హాజరైంది. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా ఖాయం అని ఫిక్స్ అంటూ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే తాజాగా సల్మాన్ భాయ్ ఈ రూమార్స్ పై క్లారిటీ ఇచ్చారు.
పుట్టినరోజు సందర్భంగా ఇటీవల సల్మాన్ ఖాన్ ఓ మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొన్నారు. అందులో రాజమౌళి సినిమాపై స్పందించారు. ఇంటర్వ్యూలో భాగంగా సల్మాన్ ఖాన్ ను ప్రశ్నించినప్పుడు అవన్నీ అన్ని ఊహాగానాలని తోసిపుచ్చాడు. తాను ప్రస్తుతం రాజమౌళితో కలిసి ఎలాంటి సినిమాకూ పని చేయడం లేదని పేర్కొన్నాడు. ఇక ‘బిగ్ బాస్ 15’ వేదికపైనే సల్మాన్ ఖాన్ కు రాజమౌళి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
