Site icon NTV Telugu

Salman Khan: సల్మాన్ రూ. 1000 కోట్లు రెమ్యూనిరేషన్.. దేనికో తెలుసా..?

Salman

Salman

Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సాల్మం.. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ను ఒంటి చేత్తో నడిపిస్తున్నాడు. మిగతా అన్ని భాషల్లో సీజన్ కు ఒక హోస్ట్ వస్తున్నారు కానీ.. హిందీ బిగ్ బాస్ అంటే సల్మాన్ ఖాన్.. ఇప్పటివరకు సల్లూభాయ్ 15 సీజన్లు విజయవంతంగా పూర్తిచేశాడు. త్వరలోనే సీజన్ 16 ను మొదలుపెట్టడానికి యాజమాన్యం సిద్ధంగా ఉన్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీజన్ 16 కు సల్మాన్ హోస్ట్ గా ఉండలేనని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. లాస్ట్ సీజన్ కే సల్మాన్ నో చెప్పడం, నిర్వాహకులు రెమ్యూనిరేషన్ పెంచి ఇస్తామని బతిమలాడి మరీ హీరోను ఒప్పించారట.

ఇక ఈసారి కూడా అదే ప్లాన్ ను వర్క్ అవుట్ చేయనున్నట్లు తెలుస్తోంది. సీజన్ 15 మొత్తానికి కలిపి సల్మాన్ దాదాపు 350 కోట్లు రెమ్యూనిరేషన్ అందుకున్నట్లు సమాచారం. అంత ఇచ్చినా కూడా సీజన్ 16 కు చేయలేనని చెప్పడంతో నిర్వాహకులు ఎలాగైనా సల్లూభాయ్ ను ఈ సీజన్ కు ఒప్పించడం కోసం ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 100 కాదు 200 కాదు ఏకంగా రూ. 1000 కోట్లు రెమ్యూనిరేషన్ ఆఫర్ చేశారట. ఇప్పటికే ఉత్తరాదిలో అత్యధిక రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న హీరోగా సల్లూభాయ్ కు పేరు ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఉత్తరాదిన మాత్రమే కాదు ఇండియాలోనే ఒక రియాలిటీ షో కు రూ. 1000 కోట్లు తీసుకున్న హీరోగా చరిత్ర సృష్టిస్తాడు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రస్తుతం సల్మాన్ కభీ ఈద్ కభీ దీవాళీ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version