Salman Khan Came Out Of House For First Time After Firing: సోమవారం, ముంబైలోని బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో కాల్పులు జరిగిన ఒక రోజు తర్వాత, సల్మాన్ ఖాన్ గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య తన ఇంటి నుండి బయటకు వచ్చాడు. సల్మాన్ తన బుల్లెట్ ప్రూఫ్ కారులో ఉండగా అతని కారు ముందు – వెనుక పోలీసు కాన్వాయ్ కనిపించింది. సల్మాన్ ఇంటి బయట పోలీసులు కూడా ఉన్నారు. సల్మాన్ ను చూడగానే అభిమానుల్లో ఆనంద వాతావరణం నెలకొని, ఆయన ధైర్యాన్ని అందరూ కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఏప్రిల్ 14న తెల్లవారుజామున 4:55 గంటలకు సల్మాన్ ఖాన్ ఇంటి బయట ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. బైక్‌పై వచ్చి ఏడు సెకన్లలో 4-5 బుల్లెట్లు కాల్చి అక్కడి నుంచి పారిపోయారు. సమీపంలోని చర్చి బయట బైక్‌ను వదిలేసి, లోకల్ ట్రైన్ పట్టుకుని శాంతా క్రజ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని ఆటోలో వకోలాకు వెళ్లారని పోలీసులు తేల్చారు.
Vishal: వరలక్ష్మి నిశ్చితార్థం.. విశాల్ షాకింగ్ కామెంట్స్!
ఇక సల్మాన్ ఇంటి బయట ఉన్న సీసీటీవీ ఫుటేజీలో అతడి ముఖం కనిపించింది. ఇక క్రైం బ్రాంచ్ బృందం ర్ కేసు దర్యాప్తు చేస్తోంది. ఇదిలావుండగా, ఒక వైపు దాడి కేసు విచారణ కొనసాగుతోండగా సల్మాన్ ప్రాణాలకు ఇంకా ముప్పు ఉందని, అయితే ఆయన మాత్రం బెదిరింపులను ధిక్కరిస్తూ తన రొటీన్ గా తన పని తాను చేసుకుంటున్నాడు అని అభిమానులు నమ్ముతున్నారు. ఇక సల్మాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ చుట్టూ పక్షి కూడా వాలకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇక మరోపక్క సల్మాన్ సోమవారం మధ్యాహ్నం ఒక వీడియోను షేర్ చేశారు. అందులో తన ఫిట్‌నెస్ బ్రాండ్ ‘బీయింగ్ స్ట్రాంగ్’ని ప్రమోట్ చేస్తూ కనిపించాడు. సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన షూటర్లకు సహాయం చేసినట్లు అనుమానిస్తున్న నవీ ముంబైకి చెందిన ఇద్దరు అనుమానితులను క్రైమ్ బ్రాంచ్ ఈ కేసులో అదుపులోకి తీసుకుంది. ఇక అంతేకాకుండా దాడికి ఉపయోగించిన బైక్ యజమానిని కూడా విచారిస్తున్నారు పోలీసులు.