Salaar post theatrical digital rights acquired by netflix for a record price: ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమా ఈనెల 28న రిలీజ్ కావాల్సి ఉండగా అనూహ్యంగా వాయిదా పడింది. కేజిఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా అనగానే అందరిలో ఒక రకమైన ఇంట్రెస్ట్ మొదలైంది. దానికి తగ్గట్టు సీజ్ ఫైర్, టీజర్ పేరుతొ రిలీజ్ చేసిన వీడియోలలో పెద్దగా స్టఫ్ లేకున్నా సినిమా మీద అంచనాలు మాత్రం అంబరాన్ని అంటాయి. ఇక ఈ క్రమంలో ఈ సినిమా థియేట్రికల్ హక్కులు మాత్రమే కాదు డిజిటల్, శాటిలైట్ రైట్స్ మీద కూడా పెద్ద పెద్ద వారే కన్నేశారు. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులకు సంబంధించిన వార్త ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే సలార్ సినిమా స్ట్రీమింగ్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ లివ్, నెట్ ఫ్లిక్స్ లాంటి బడా సంస్థలు పోటీపడినట్టు తెలుస్తోంది.
Mark Antony Review: మార్క్ ఆంటోని రివ్యూ
ఇక మాంచి పోటీలో నెట్ ఫ్లిక్స్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ స్ట్రీమింగ్ హక్కులను చేజిక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు గాను నెట్ ఫ్లిక్స్ జీఎస్టీతో కలిపి దాదాపు 185 కోట్లను చెల్లించినట్టుగా చెబుతున్నారు. ఇది కేవలం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ బాషలకే అని హిందీకి వేరే రేటు పెట్టాలని నిర్మాతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఒక రకంగా ఒక సౌత్ ఇండియన్ సినిమాకు సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ లో ఇదే పెద్ద ఓటీటీ డీల్ అని తెలుస్తోంది. సరైన హిట్స్ లేకపోయినా పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ కి ఉన్న మార్కెట్, సూపర్ హిట్ సినిమాలతో ప్రశాంత్ నీల్ కి ఇండియా వైడ్ ఉన్న ఇమేజ్ తో పాటు హోంబలే బ్యానర్ ఇమేజ్ కూడా ఈ భారీ రేటు పలికేందుకు కారణం అని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా జగపతిబాబు, పృథ్వీ రాజ్ సుకుమారన్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించారు.