సలార్ సీజ్ ఫైర్ సినిమాలో కమాండర్ సలార్ దేవరథ రైజార్ ని ఖాన్సార్ లో అడుగు పెట్టించి… సినిమాని ఆపేసాడు ప్రశాంత్ నీల్. ఇండియన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్ డ్రామాని క్రియేట్ చేసి లార్జ్ స్కేల్ సినిమాని చూపించాడు ప్రశాంత్ నీల్. పృథ్వీరాజ్ కోసం వచ్చి ఖాన్సార్ ఊచకోత కోస్తున్న ప్రభాస్, పార్ట్ 2లో పృథ్వీకి ఎనిమీగా ఎలా మారుతాడు అనే ట్విస్ట్ తో పార్ట్ 1కి ఎండ్ ఇచ్చాడు. పార్ట్ 1 ఎండ్ లో సీజ్ ఫైర్ ని ఎత్తడంతో రాజ మన్నార్, రాధా రామ మన్నార్ ల ఆధిపత్యం కొనసాగించే పోరాటం మొదలుపెట్టారు. రుద్ర మన్నార్ అధికారం కోసం వరద రాజమన్నార్ ని చంపడానికి రెడీ అయ్యాడు. ఘన్సార్ తెగ నాయకుడు బాలి తన సైన్యంతో రాజ మన్నార్ తెగపై తిరుగుబాటుకు సిద్ధమయ్యాడు… ఈ అందరికీ కామన్ ఎనిమీగా వరద రాజమన్నార్ ఉన్నాడు. అందరూ కలిసి వరద రాజమన్నార్ ని చంపాలి అని స్కెచ్ వేసినా వాళ్లందరినీ ఆపడానికి సలార్ దేవరథ రైజార్ ఉన్నాడు.
ఇక్కడ ఇంట్రెస్టింగ్ టర్న్ ఓవర్ ఏంటంటే వరద రాజమన్నార్ కి అందరికన్నా అతిపెద్ద శత్రువుగా మారబోతున్నాడు దేవరథ రైజర్. శౌర్యాంగ తెగ నాయకుడు భారవ, దేవరథ కోసం సైన్యం తయారు చేసాడు. స్నేహితుల నుంచి శత్రువులుగా మారిన వరద రాజమన్నార్, సలార్ దేవరథల యుద్ధంతో పార్ట్ 2 శౌర్యాంగ పర్వం ముగుస్తుంది. అయితే ఈ ఇద్దరి వార్ వరకూ వెళ్లడం అంతే ఈజీ డ్రైవ్ కాదు. అంతకన్నా ముందు మన్నార్, శౌర్యాంగ, ఘన్సార్ తెగల మధ్య ఖాన్సార్ లో అంతర్యుద్ధం మొదలవుతుంది. ఈ యుద్ధం సమయంలో దేవరథ రైజార్, వరద రాజమన్నార్ కి అండగా ఉంటాడు. సో పార్ట్ 2 శౌర్యాంగ పర్వంలో చాలా డ్రామా ఉంటుంది. పర్ఫెక్ట్ ప్లాన్ చేసి కొడితే ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ కలిసి బాహుబలి కలెక్షన్స్ ని బీట్ చేయడం పెద్ద కష్టమేమి కాదు.